Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సిరివెన్నెలను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతేడాది నవంబర్ లో కన్నుమూశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతగానో బాధపడ్డారు. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు నాడున మరొకసారి ఆయన్ను గుర్తుచేసుకుంటూ అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సిరివెన్నెలను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
''నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే"
'రుద్రవీణ' చిత్రంలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని ఈ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి.
కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల' గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి.. అంటూ రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'భీమ్లానాయక్' సినిమాతో అలరించిన ఆయన.. వరుస సినిమాలు కమిట్ అయ్యారు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలానే హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' లైన్ లో ఉంది. ఇవి పూర్తి కాకుండానే.. సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
" నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
— Pawan Kalyan (@PawanKalyan) May 23, 2022
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే"
'రుద్రవీణ' చిత్రంలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని ఈ పంక్తులు నన్నెoతో ప్రభావితం చేశాయి.
కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి 'సిరివెన్నెల' గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి...🙏 pic.twitter.com/WdxiCSjIDh
— Pawan Kalyan (@PawanKalyan) May 23, 2022