NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
మే 20న ఎన్టీఆర్ తన బర్త్ డే వేడుకలను కొందరు స్నేహితుల సమక్షంలో జరుపుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా తన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. కొరటాల శివ డైరెక్ట్ చేయనున్న NTR 30 మోషన్ పోస్టర్ ను, ప్రశాంత్ నీల్ తో చేయనున్న NTR 31 పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తరువాత బుచ్చిబాబుతో సినిమా ఉంటుందని అంటున్నారు.
అయితే ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. అతడు ఎవరంటే.. వంశీ పైడిపల్లి. మే 20న ఎన్టీఆర్ తన బర్త్ డే వేడుకలను కొందరు స్నేహితుల సమక్షంలో జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కనిపించడంతో.. అతడితో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందని క్రేజీ రూమర్స్ మొదలయ్యాయి.
ఎన్టీఆర్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ చాలా ఏళ్ల క్రితం 'బృందావనం' అనే సినిమా వచ్చింది. అప్పట్లో అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిసి పని చేసే ఛాన్స్ ఉందని వార్తలను ప్రచురిస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. తమిళ హీరో దళపతి విజయ్ తో సినిమా తీస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ కూడా తన కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కాబట్టి వీరి కాంబినేషన్ లో ఇప్పట్లో సినిమా లేనట్లే. కేవలం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వంశీ అతడిని కలిసినట్లు తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!
Also Read: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
View this post on Instagram