Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన లోకేష్ కనగరాజ్.. మహేష్ బాబుని కలిసినట్లు తెలుస్తోంది.
![Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో? Meeting between Lokesh Kanagaraj and Mahesh Babu sparks speculation Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/22/e49f7223dcb430d9c27ed2f01775fdc7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు చాలా కాలంగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. 'ఖైదీ', 'మాస్టర్' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లను పెట్టి 'విక్రమ్' అనే సినిమాను తెరకెక్కించారు. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విడుదల చేయనున్నారు.
ఈ సినిమా విడుదలైన తరువాత దర్శకుడు లోకేష్ తెలుగులో సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి. రామ్ చరణ్ తో ఆయన సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మహేష్ బాబుని మీట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. 'విక్రమ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన లోకేష్ కనగరాజ్.. మహేష్ బాబుని కలిసినట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. లోకేష్ దర్శకత్వంలో పని చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సరైన స్క్రిప్ట్ ను రెడీ చేస్తే కచ్చితంగా వీరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరప్ కి ట్రిప్ కి బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తిరిగి రాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. జూలైలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ ఏడాది చివరికి సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలనేది ప్లాన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే వచ్చే ఏడాది నుంచి రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్తారు మహేష్ బాబు.
Also Read: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!
Also Read: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)