Panchayat 3 Release Date: ‘పంచాయత్ సీజన్ 3‘పై అమెజాన్ ప్రైమ్ కీలక అప్ డేట్, నెటిజన్లను భలే టీజ్ చేసిందిగా!
పాపులర్ వెబ్ సిరీస్ ‘పంచాయత్ సీజన్ 3’ గురించి కీలక అప్ డేట్ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
![Panchayat 3 Release Date: ‘పంచాయత్ సీజన్ 3‘పై అమెజాన్ ప్రైమ్ కీలక అప్ డేట్, నెటిజన్లను భలే టీజ్ చేసిందిగా! Panchayat 3 OTT Release Date When and where to watch Jinendra Kumar web series third season Panchayat 3 Release Date: ‘పంచాయత్ సీజన్ 3‘పై అమెజాన్ ప్రైమ్ కీలక అప్ డేట్, నెటిజన్లను భలే టీజ్ చేసిందిగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/92582f5f0eb2d190a9cec3746e7e4b881714480982076544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Panchayat Season 3 OTT Release: ‘పంచాయత్’ వెబ్ సిరీస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. గ్రామీణ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ సినీ అభిమానులను బాగా అలరించింది. రెండు సిరీస్ లు సక్సెస్ కావడంతో మూడో సీజన్ తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే వెల్లడించింది. ‘పంచాయత్ సీజన్ 3’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?
‘పంచాయత్ సీజన్ 3’ రిలీజ్ డేట్ పై కీలక ప్రకటన
‘పంచాయత్ సీజన్ 3’ సిరీస్ రిలీజ్ డేట్ గురించి అమెజాన్ ప్రైమ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు వెల్లడించింది. ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోతో నెటిజన్లను ఫన్నీగా ఆటపట్టించింది. వీడియోకు “దయచేసి ఓపెన్ చేయకండి. లోపల ‘పంచాయత్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఉంది” అని ఓ ఫ్రిజ్ డోర్ కు పేపర్ అంటించారు. ఆ ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయగానే లోపల అన్నీ సొరకాయులు ఉన్నట్లు చూపించారు. “ప్రయత్నించారుగా.. అంత ఈజీ కాదు, చూస్తూనే ఉండండి” అంటూ ఆటపట్టించింది. అయితే, త్వరలో విడుదల అవుతుందని మాత్రం అమెజన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
just a little more wait till you find out Panchayat's new season's date 👀 #PanchayatOnPrime pic.twitter.com/gHvRJytL0Z
— prime video IN (@PrimeVideoIN) April 29, 2024
మే చివరి వారంలో లేదంటే జూన్ తొలి వారంలో విడుదల?
‘పంచాయత్’ వెబ్ సిరీస్‍లో జితేంద్ర కుమార్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. పంచాయతీ సెక్రెటరీగా చక్కటి నటనతో ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఈ సిరీస్ లో జితేంద్ర కుమార్ తో పాటు నీనా గుప్తా, సన్విక, రఘువీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్ ఇరత పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా, ఈ సిరీస్ కు దీపక్ కుమార్ మిశ్ర దర్శకత్వం వహిస్తున్నారు. ది వైరల్ ఫీవర్ బ్యానర్ పై అర్ణబ్ కుమార్, శ్రేయాన్శ్, పాండే, విజయ్ కోషీ నిర్మిస్తున్నారు. ‘పంచాయత్’ తొలి సీజన్ అమెజాన్ లో 2020 ఏప్రిల్ 3న విడుదల అయ్యింది. గ్రామీణ ప్రాంత కథతో నడిచే ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీనికి కొనసాగింపుగా ‘పంచాయత్ 2’ 2022 మే 20న విడుదల అయ్యింది. రెండో సీజన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రెండు సీజన్లు ఆకట్టుకోవడంతో మూడో సీజన్ పై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ వెబ్ సిరీస్ ఐపీఎల్ 2024 తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. మే చివరలో లేదంటే జూన్ తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
Read Also: 'శబరి' నుంచి మరో సాంగ్ విడుదల- సరికొత్తగా ఆకట్టుకుంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)