SABARI Song: 'శబరి' నుంచి మరో సాంగ్ విడుదల- సరికొత్తగా ఆకట్టుకుంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మరోసాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
SABARI Movie Alisina Oopiri Song: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న సినిమా 'శబరి'. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు అనిల కాట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. మే 3న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఆకట్టుకుంటున్న‘అలిసిన ఊపిరి’ సాంగ్
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తోంది. తాజాగా ‘అలిసిన ఊపిరి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు కరుణ కుమార్ ఈ పాటను రిలీజ్ చేశారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఈ పాటను రెహమాన్ రాశారు. ప్రముఖ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటలోని బలమైన పదాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
‘శబరి’ మంచి హిట్ అందుకుంటుంది- దర్శకుడు కరుణ కుమార్
ఇప్పటికే 'శబరి' నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటు తల్లి కూతుళ్ల మధ్య అనుబంధం, ప్రేమను వ్యక్త పరిచాయి. ఇక 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న వరలక్ష్మిని హైలెట్ చేశారు. కూతురి కోసం తల్లి పడే తననను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఈ పాటపై దర్శకుడు కరుణ కుమార్ ప్రశంసలు కురిపించారు. పాట, విజువలైజేషన్ అద్భుతంగా ఉందన్నారు. తల్లీ కూరుతుకు సంబంధించి భావోద్వేగాన్ని చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ సినిమా తప్పకుండా చక్కటి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి నటి ఈ చిత్రంలో నటించడం తప్పకుండా కలిసి వస్తుందన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువగా వస్తున్న సమయంలో మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించారని అభినందించారు.
మే 3న పాన్ ఇండియా మూవీగా విడుదల
ఇక ‘శబరి’ సినిమాను మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ట్రైలర్ తో పాటు ఇప్పటికే విడుదల చేసిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలోని తల్లి కూతుళ్ల అనుబంధం, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అన్నారు.
ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.