Varalaxmi Sarath Kumar: పెద్ద టీవీ ఛానెల్ వ్యక్తి రూమ్ బుక్ చేస్తా వచ్చేయ్ అన్నాడు, వాడికి అలా బుద్ధి చెప్పా: వరలక్ష్మీ శరత్ కుమార్
Varalaxmi Sarath Kumar: వరలక్ష్మీ శరత్ కుమార్.. తమిళ్, తెలుగులోపెద్ద యాక్టర్. అయితే, ఆమె కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారట. ఒకరు వచ్చి రూమ్ బుక్ చేస్తాను అన్నారట.
![Varalaxmi Sarath Kumar: పెద్ద టీవీ ఛానెల్ వ్యక్తి రూమ్ బుక్ చేస్తా వచ్చేయ్ అన్నాడు, వాడికి అలా బుద్ధి చెప్పా: వరలక్ష్మీ శరత్ కుమార్ Varalaxmi Sarath Kumar About MArriage And Movies Varalaxmi Sarath Kumar: పెద్ద టీవీ ఛానెల్ వ్యక్తి రూమ్ బుక్ చేస్తా వచ్చేయ్ అన్నాడు, వాడికి అలా బుద్ధి చెప్పా: వరలక్ష్మీ శరత్ కుమార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/433dd094f6055b156d057a6983314fab1714406878330932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Varalaxmi Sarath Kumar About Marriage And Movies: వరలక్ష్మీ శరత్ కుమార్.. తమిళ, తెలుగు భాషల్లో ఎన్నోసినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించారు. నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. అయితే, ఆమె కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారట. 'శబరీ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మే 3న ‘శబరి’ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఒకప్పుడు నాన్న సినిమాలు వద్దన్నారని, ఇప్పుడు ఆయనే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారని చెప్పారు వరలక్ష్మీ.
గర్వంగా ఫీల్ అవుతున్నారు...
నాన్నకి అస్సలు సినిమాలు ఇష్టం లేదు. ఆ టైంలో ఇండస్ట్రీ చాలా డిఫరెంట్ కదా. అందుకే, ఆయన అలా చెప్పి ఉండొచ్చు. ఆయనకు అన్ని తెలుసు కదా? అందుకే, వద్దన్నారేమో. నాన్న వద్దనాన్నరని కొన్ని ఛాన్సులు కూడా మిస్ చేసుకున్నాను. కానీ, ఇప్పుడు ఆయన హ్యాపీ. మొన్న కూడా చెప్పారు. నేనేం చేయలేదు అదే పైకి వచ్చింది అని అన్నారు. ఇప్పుడు ఆయన చాలా గర్వంగా ఉన్నారు. అమ్మ నాతో షూటింగ్స్ కి వస్తానని చెప్పడంతోనే నాన్న ఒప్పుకున్నారు. అలా ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను.
నాన్న భయపడినట్లు జరిగిందా?
నాన్న భయపడిన సిచ్యుయేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి. కానీ, మనం ఎలా హ్యాండిల్ చేశాం అనేది ఇంపార్టెంట్. రిజక్షన్స్ చాలా ఉంటాయి. అన్ని ఫేస్ చేయాలి. పెద్ద ఛానెల్ హెడ్ ఒకరు ఇంటికి వచ్చి ఏదో విషయం మాట్లాడారు. "నెక్ట్స్ ఎప్పుడు కలుద్దాం" అన్నారు. పని ఏమైనా ఉందా? అన్నాను. "లేదు వేరే పనులు" అన్నారు. "రూమ్ బుక్ చేస్తా" అన్నారు. నా ఇంటికి వచ్చి నన్నే ఇలా అడుగుతావా? అని కేసు పెట్టాను. అప్పుడే సేవ్ శక్తి అని ఎన్జీవో స్టార్ట్ చేశాను. చాలా సినిమాలు రిజక్ట్ చేశారు. చాలా ప్రొఫెషనల్ అని రిజెక్ట్ చేశారు. నేను కూడా చాలా క్యారెక్టర్లు వదులుకున్నాను. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతుకుతున్నాను.
పెళ్లి ఎప్పుడు? నాన్న ఎలా ఫీల్ అయ్యారు?
పెళ్లి.. డేట్ ఫిక్స్ అయ్యింది. కొంచెం పనులు ఉన్నాయి. త్వరలోనే ఉంటుంది. నా పెళ్లి కుదిరినప్పుడు నాన్న చాలా హ్యాపీ. కూతురు పెళ్లి అంటే వాళ్లకు అదేదో హ్యాపీనెస్ వస్తుంది కదా అలా ఆయన చాలా హ్యాపీ. పెళ్లికి సంబంధించి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. నేను ఫ్లో తో వెళ్లిపోతా. అన్ని ముందు ఆలోచించను. అలా జరగాలి, ఇలా జరగాలి అని అనుకోను.
రూమర్స్ గురించి, రాజకీయాల గురించి ఏమంటారు?
విశాల్ తో పెళ్లి రూమర్ బోర్ కొట్టేసింది. అది తప్ప నా గురించి పెద్దగా వచ్చిన రూమర్ ఏమీ లేదు. రాధిక గారితో మంచి బాండింగ్ ఉంటుంది. చిల్ ఫ్యామిలీ, బ్లెండిడ్ ఫ్యామిలీ. నాన్న పాలిటిక్స్ లో ఉన్నారు. ఇప్పుడు అయితే నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. కానీ, ఫ్యూచర్ లో ఏమో చెప్పలేం. నేను ఓట్ ద్వారానే ఏదైనా చెప్తాను.
Also Read: ముద్దు సీన్లు వద్దంటారు - అమ్మనాన్నల చాలా సినిమాలు వదిలేశా: మృణాల్ ఠాకూర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)