Ghaati OTT: అక్టోబర్‌లో ఓటీటీకి 'ఘాటీ' - స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయ్యిందా? లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Ghaati OTT Release Date: అనుష్క శెట్టి 'ఘాటీ'ని అక్టోబర్ నెలలో ఓటీటీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ చేశారా? ఇండస్ట్రీలో టాక్ ఏమిటంటే?

క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'ఘాటీ' (Ghaati Movie). థియేటర్ల నుంచి ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. ఆడియన్స్ రావడం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఫిలిం నగర్ వర్గాలలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
అక్టోబర్ మొదటి వారంలో ఓటీటీకి ఘాటీ!
Ghaati OTT Release Date: సెప్టెంబర్ 5న 'ఘాటీ' సినిమా విడుదల అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా అగ్రిమెంట్ జరిగిందట. ఆ లెక్కన అక్టోబర్ మొదటి వారంలో ఓటీటీలో విడుదల అవుతుంది.
Ghaati - Anushka Movie OTT Platform: 'ఘాటీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోందట. అక్టోబర్ 2 లేదా 3వ తేదీల్లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్.
థియేటర్లలో హిట్ కాలేదు... మరి ఓటీటీలో!?
థియేటర్లలో 'ఘాటీ' హిట్ కాలేదు. మరి, ఈ తరుణంలో ఓటీటీలో ఈ మూవీకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల కొన్ని సినిమాలకు థియేటర్లలో అంతగా ఆడకపోయినా ఓటీటీలో విడుదలైన తర్వాత హాట్ అయ్యాయి. మంచి సినిమాను థియేటర్లలో మిస్ అయ్యామని సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. 'ఘాటీ' కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.
Also Read: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?
'ఘాటీ'లో అనుష్కకు జంటగా కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ ప్రభు నటించాడు. ఈ మూవీలో జగపతి బాబు, జిష్షు సేన్ గుప్తా, లారిస్సా బోనేసి, జాన్ విజయ్, వీటీవీ గణేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి విద్యాసాగర్ నాగవెల్లి మ్యూజిక్ అందించాడు.





















