SS Rajamouli: జక్కన్న జిందాబాద్ - నెట్‌ఫ్లిక్స్‌లో రాజమౌళి బయోగ్రఫీ, ఇది కదా మనకు కావల్సింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
భారతీయ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొస్తోంది. ‘మోడ్రన్ మాస్టర్స్-ఎస్ ఎస్ రాజమౌళి’ పేరుతో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
SS Rajamouli Documentary On Netflix: ఎస్ ఎస్ రాజమౌళి. భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు. తెలుగు గడ్డపై పుట్టి.. అంతర్జాతీయ సినీ దిగ్గజాలు మెచ్చుకునే స్థాయికి వెళ్లారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలతో భారతీయ సినిమాలను హాలీవుడ్ చిత్రాల సరసన నిలిపి ఇండియన ఫిల్మ్ ఇండస్ట్రీ సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. అలాంటి దిగ్గజ దర్శకుడిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తెరకెక్కించింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
ఓటమి ఎరుగని సినీ ప్రయాణం జక్కన్న సొంతం
2021లో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అపజయం అంటూ ఎరుగకుండా ఇండస్ట్రీలో విజయదుందుబి మోగించారు. ‘సింహాద్రి’, ‘సై’, ‘ఛత్రపతి’, విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘రాజన్న’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్‘ సినిమాలు ఒకదానిని మించి మరొకటి అద్భుత విజయాలను అందుకున్నాయి. సాధారణ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆయన.. ఒక్కోమెట్టు ఎక్కుకుంటూ ఆస్కార్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఏకంగా పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా.. రూ. 1000 కోట్ల బడ్జెట్ తో వెండితెరపై అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఆగష్టు 2న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళిపై ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ప్లిక్స్ ప్రత్యేకంగా ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. ‘మోడ్రన్ మాస్టర్స్- ఎస్ ఎస్ రాజమౌళి’ పేరుతో ఈ డాక్యుమెంటరీని రెడీ చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ ప్రముఖు రాజమౌళి గురించి ఈ డాక్యుమెంటరీలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లు జేమ్స్ కామెరూన్, జో రూసో, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సహా, రాజమౌళి సినిమాల్లో హీరోలుగా నటించిన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా సహాల పలువురు నటులు తన ఓపీనియన్ వెల్లడించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇండియన్, ఇంటర్నేషనల్ సినిమా ఇండస్ట్రీపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు.
View this post on Instagram
రాజమౌళి విజనరీ డైరెక్టర్- అనుపమ చోప్రా
ఇక ఈ ‘మోడ్రన్ మాస్టర్స్- ఎస్ ఎస్ రాజమౌళి’ డాక్యుమెంటరీని అనుపమ చోప్రా సమర్పిస్తున్నారు. తాజాగా ఆమె ఈ డాక్యుమెంటరీపై కీలక విషయాలు వెల్లడించింది. దర్శకుడు రాజమౌళికి ఓ స్పెషల్ విజన్ ఉందని, అదే ఇండియన్ సినిమాను కీలక మలుపుతిప్పిందన్నారు. ప్రపంచ సినిమా పరిశ్రమపై అత్యద్భుతమైన ముద్ర వేశారని ప్రశంసించారు. అతడి కెరీర్ ను డాక్యుమెంటరీ రూపంలో తీసుకు రావడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
Read Also: మహేష్ మూవీలో విలన్గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!