అన్వేషించండి

SSMB29: మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో మలయాళీ స్టార్ హీరో విలన్ పాత్ర పోషిస్తున్నారట.

Prithviraj Sukumaran To Play Villain In Mahesh Babu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతున్నది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాను తీయబోతున్నారు జక్కన్న. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మహేష్ బాబు కష్టపడుతున్నారు. తన పాత్రకు తగినట్లుగా లుక్, బాడీ షేప్ మార్చుకునేందుకు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టిన రాజమౌళి

హైదరాబాద్ లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన పెద్ద పెద్ద సెట్స్ వేస్తున్నారు. అక్కడే వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేయగా,  ప్రస్తుతం యాక్టర్లు సెలక్షన్ పై రాజమౌళి కాన్సంట్రేషన్ పెట్టారు. ఇండియాతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన యాక్టర్లతో పాటు టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీని తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, వాటిని మేకర్స్ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

SSMB29లో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్!

ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీలో రాజమౌళి మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను విలన్ గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ పోటీగా ఆయన సరిగ్గా సరిపోతారాని జక్కన్న భావిస్తున్నారట. ఇప్పటికే సెలక్షన్ పూర్తయినా, ఈ విషయాన్ని బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితం అయిన పృథ్వీరాజ్.. రీసెంట్ గా వచ్చిన ‘సలార్’ సినిమాతో పాన్ ఇండియా రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ప్రభాస్ తో పోటీపడి నటించిన ఆయన, తన పాన్ వరల్డ్ మూవీలో విలన్ పాత్రకు సరిపోతాడని భావించి రాజమౌళి ఎంపిక చేశారట.

కథ వినకుండానే ఓకే చెప్పిన పృథ్వీరాజ్!

అటు ఈ సినిమా స్టోరీని సుకుమారన్ కు వివరించాలని రాజమౌళి భావించారట. అయితే, ఆయన కథ వినకుండానే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఆఫర్ ఇస్తే నో చెప్పడం అనేది ఉండదన్నారట సుకుమారన్. ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారట. ఇక ఈ మూవీ దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ లో తెరకెక్కబోతోంది. కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్  ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు.

Also Read: నేను చాలా వికారంగా ఉంటాను, అదంతా నాకు అలవాటైపోయింది - నవాజుద్దీన్ సిద్ధికి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Honda Shine 125: రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
రూ.10 వేలు కట్టి ఈ బైక్ తీసుకెళ్లచ్చు - నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget