అన్వేషించండి

Nawazuddin Siddiqui: నేను చాలా వికారంగా ఉంటాను, అదంతా నాకు అలవాటైపోయింది - నవాజుద్దీన్ సిద్ధికి

Nawazuddin Siddiqui: ప్రస్తుతం వర్సటైల్ యాక్టర్‌గా బాలీవుడ్‌లో వెలిగిపోతున్నారు నవాజుద్దీన్ సిద్ధికి. కానీ కెరీర్ మొదట్లో తన లుక్స్ గురించి ట్రోల్స్ ఎదుర్కున్నానని బయటపెట్టారు.

Nawazuddin Siddiqui: బాలీవుడ్‌లో ఏ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్లుగా ఎదిగినవారు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో నవాజుద్దీన్ సిద్ధికి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ యాక్టర్. ‘ది లంచ్‌బాక్స్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’, ‘కహానీ’, ‘సేక్రెడ్ గేమ్స్’ లాంటి సినిమాలు, సిరీస్‌లు నటుడిగా నవాజుద్దీన్ సిద్ధికికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ కెరీర్ మొదట్లో లుక్స్ పరంగా ఎంతో నెగిటివిటీని ఎదుర్కున్నారు నవాజుద్దీన్. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇండస్ట్రీలో లుక్స్ పరంగా తానే వికారమైన యాక్టర్ అనుకుంటానని తెలిపారు.

వికారంగా ఉంటాను..

తన లుక్స్ గురించి నేరుగానే నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి గురించి నవాజుద్దీన్ సిద్ధికి స్పందించారు. ‘‘మా లుక్స్ కొందరికి ఎందుకు నచ్చవో నాకు తెలియదు. ఎందుకంటే మేము వికారంగా ఉన్నామని వారికి అనిపిస్తుందేమో. నాకు కూడా అద్దంలో చూసుకున్నప్పుడు అదే నిజమేమో అనిపిస్తుంటుంది. అసలు ఇలాంటి లుక్స్‌తో ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. లుక్స్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా వికారమైన యాక్టర్. ఈ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ముందు నుండే ఇదంతా నేను వింటూ ఉన్నాను. ఇప్పుడు ఇదే నేను నమ్ముతున్నాను కూడా’’ అని తెలిపారు నవాజుద్దీన్.

నేరుగా ఓటీటీ సినిమాలు..

తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో రకాల పాత్రలు పోషించడం సంతోషంగా ఉందని అన్నారు నవాజుద్దీన్ సిద్ధికి. ఆయన చివరిగా ‘హడ్డీ’ అనే మూవీలో నటించారు. అది జీ5లో విడుదలయ్యింది. ఇందులో నవాజుద్దీన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తను లీడ్ రోల్ చేసిన మరో సినిమా ‘రౌతూ కా రాజ్’.. జూన్ 28న జీ5లో విడుదలయ్యింది. దీనిని ఆనంద్ సురాపూర్ డైరెక్ట్ చేశారు. ఇందులో నవాజుద్దీన్‌తో పాటు అతుల్ తివారీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఎప్పుడూ తన అప్‌కమింగ్ చిత్రాలను పెద్దగా హడావిడి లేకుండా విడుదల చేస్తుంటారు నవాజుద్దీన్ సిద్ధికి. అందుకే ఇప్పుడు కూడా తన తరువాతి సినిమాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు.

వెబ్ సిరీస్‌లు కూడా..

సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లలో కూడా నవాజుద్దీన్ సిద్ధికి స్టోరీ సెలక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలయిన ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్‌లో నవాజుద్దీన్ క్యారెక్టర్ చాలా బాగుందని ఆడియన్స్ ప్రశసించారు. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు చిత్రాల షూటింగ్ జరుగుతుండగా.. మరో మూవీ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి చేరుకుంది. కానీ వీటి విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు. ‘సేక్రెడ్ గేమ్స్’ తర్వాత నవాజుద్దీన్ మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ తన అప్‌కమింగ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.

Also Read: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్ - ఫ్యాన్ స్పెషల్ రిక్వెస్ట్... పెద్ది రియాక్షన్ ఇదే
పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్ - ఫ్యాన్ స్పెషల్ రిక్వెస్ట్... పెద్ది రియాక్షన్ ఇదే
Actor Supreeth : వివాదంలో ఛత్రపతి కాట్‌రాజ్ - నటుడు సుప్రీత్‌పై క్యాబ్ డ్రైవర్ పోలీస్ కంప్లైంట్
వివాదంలో ఛత్రపతి కాట్‌రాజ్ - నటుడు సుప్రీత్‌పై క్యాబ్ డ్రైవర్ పోలీస్ కంప్లైంట్
Janhvi Kapoor : జాన్వీ కపూర్‌కే మా సపోర్ట్ - డైరెక్టర్ హద్దులు దాటారు... అచ్చియమ్మ రోల్ కాంట్రవర్సీపై లేటెస్ట్ కామెంట్
జాన్వీ కపూర్‌కే మా సపోర్ట్ - డైరెక్టర్ హద్దులు దాటారు... అచ్చియమ్మ రోల్ కాంట్రవర్సీపై లేటెస్ట్ కామెంట్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో పెద్ద సినిమాలు - వీరభద్రుడు To భూత్ బంగ్లా... తెలుగు బోల్డ్ సిరీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో పెద్ద సినిమాలు - వీరభద్రుడు To భూత్ బంగ్లా... తెలుగు బోల్డ్ సిరీస్ డోంట్ మిస్

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
IND vs AFG Test Highlights: భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
భారత స్పిన్‌కు అఫ్గాన్ విలవిల.. అరంగేట్రంలోనే మానవ్ సుతార్ సరికొత్త చరిత్ర.. 412 రన్స్ ఆధిక్యం
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Carpal Tunnel Syndrome : యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
యువతలో పెరుగుతున్న కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఫోన్, ల్యాప్‌టాప్ ఉపయోగించడమే కారణమా?
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Embed widget