Juhi Chawla: EMI కట్టలేదని షారుఖ్ కారును తీసుకెళ్లిపోయారట, పాపం ఏమీ మిగల్లేదు: జుహీ చావ్లా
Juhi Chawla: షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా ఫ్రెండ్‌షిప్ ఎన్నో ఏళ్లుగా అలాగే ఉంది. షారుఖ్ హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలో ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నారో తాజాగా బయటపెట్టారు జూహీ.
Juhi Chawla About Shah Rukh Khan: ఒకప్పుడు అసలు రెమ్యునరేషన్ లేకుండా నటించిన చాలామంది నటీనటులు.. ఇప్పుడు పెద్ద స్టార్లు అయిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఎస్‌ఆర్‌కే అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి రావడం కోసం షారుఖ్ చాలా కష్టపడ్డారు. తన కెరీర్ మొదట్లో తాను ఎదుర్కున్న కష్టాల గురించి పలు ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఈ స్టార్ హీరో. తాజాగా తన కో స్టార్, బెస్ట్ ఫ్రెండ్ అయిన జూహీ చావ్లా కూడా ఎస్ఆర్‌కే కెరీర్ మొదట్లో పడిన కష్టాల గురించి బయటపెట్టారు. ఇండస్ట్రీలో షారుఖ్‌కు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో జూహీ చావ్లా కూడా ఒకరు.
ఇప్పటికీ ఫ్రెండ్స్..
షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా పెయిర్‌కు కూడా బాలీవుడ్‌లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే 1990ల్లో, 2000ల్లో వచ్చిన చాలావరకు హిట్ సినిమాల్లో వీరిద్దరూ హీరో, హీరోయిన్‌గా అలరించారు. అందుకే కాకుండా ఐపీఎల్‌లో కోలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్) టీమ్‌కు షారుఖ్ ఓనర్‌గా వ్యవహరిస్తుండగా జూహీ కూడా కో ఓనర్ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్న సమయానికి షారుఖ్ ఇంకా అప్‌కమింగ్ యాక్టర్‌గానే ఉన్నారు. అందుకే తన ఆర్థిక ఇబ్బందులను జూహీ చావ్లా చూశారు. అలా ఒకసారి షారుఖ్ దగ్గర డబ్బులు లేక ఈఎమ్ఐ కట్టకపోవడంతో తన కారును తీసుకెళ్లిపోయారని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జూహీ బయటపెట్టారు.
అన్నీ ఒకేసారి..
‘‘ఆరోజుల్లో షారుఖ్ ఖాన్ పరిస్థితి నాకు బాగా గుర్తుంది. తనకు ముంబాయ్‌లో ఇల్లు లేకపోవడంతో ఢిల్లీ నుండి వచ్చేవాడు. తనకు వంట చేసి పెట్టడానికి ఎవరూ ఉండేవారు కాదు. తను ఎక్కడ ఉండేవాడో కూడా నాకు సరిగా తెలియదు. మూవీ యూనిట్‌తోనే కలిసి వారి ప్లేట్‌లోనే భోజనం చేసేవాడు. వారితో కలిసి ఛాయ్ తాగేవాడు. వారితో కలిసిపోయి నవ్వుతూ ఉండేవాడు. తనకు ఒక కారు ఉండేది. అదే జీప్. నాకు గుర్తున్నంత వరకు అదొక బ్లాక్ కలర్ జీప్. దానికోసం 2,3 షిఫ్ట్స్ చేసేవాడు. రాజు బన్ గయా జెంటిమ్యాన్, దిల్ ఆష్నా హై, దివ్యతో మరో సినిమా.. ఇలా అన్నీ ఒకేసారి చేస్తున్నాడు. తను చాలా డెడికేషన్‌తో రోజంతా పనిచేస్తూనే ఉండేవాడు. పలు కారణాల వల్ల ఒకసారి ఈఎమ్ఐ కట్టలేదు. దీంతో తన కారు తీసుకెళ్లిపోయారు. ఇంక తన దగ్గర ఏమీ మిగలలేదు’’ అని గుర్తుచేసుకున్నారు జూహీ చావ్లా.
తనకు గుర్తుంది..
‘‘ఆరోజు షారుఖ్ చాలా నీరసంగా సెట్స్‌కు వచ్చాడు. నేను తనకు ఏం చెప్పానో సరిగా గుర్తులేదు కానీ బాధపడకు, నువ్వు ఇంకా చాలా కార్లు కొంటావు అని ఏదో చెప్పుంటాను. అవి వస్తాయి, చూడు అన్నాను. తనకు ఇంకా నేను చెప్పింది గుర్తుంది. ఇప్పుడు తనను చూడండి. ఎంత ఎదిగిపోయాడో చూడండి’’ అంటూ తన ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ గురించి గర్వంగా చెప్పారు జూహీ చావ్లా. వీళ్లిద్దరూ కలిసి ‘డర్’, ‘ఎస్ బాస్’, ‘ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ’, ‘రాజు బన్ గయా జెంటిల్‌మ్యాన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. షారుఖ్, కాజోల్ లాగా షారుఖ్, జూహీ చావ్లా పెయిర్ కూడా ఆన్ స్క్రీన్‌పై సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
Also Read: బుల్లితెర TO వెండితెర వయా టాలీవుడ్ - 32వ వసంతంలోకి అడుగు పెట్టిన సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు!