HBD Rhea Chakraborty: బుల్లితెర TO వెండితెర వయా టాలీవుడ్ - 32వ వసంతంలోకి అడుగు పెట్టిన సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు!
బుల్లితెరపై నటిగా సత్తా చాటి వెండితెరపై అడుగు పెట్టింది రియా చక్రవర్తి. తెలుగు సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచమై.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ కేసులో అరెస్టై సంచలనం కలిగించింది.
Happy Birthday Rhea Chakraborty: అమ్మాయిలు సినిమా పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయమే కాదు, కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. అవకాశాలు వచ్చినా, అదృష్టం కలిసి రాక తక్కువ కాలంలోనే ఫేడౌట్ అయిన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. మరికొంత మంది హీరోయిన్లు సినిమాల కంటే వివాదాలతోనే బాగా పాపులర్ అవుతారు. ఈ రెండు లక్షణాలు కలిగిన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి. నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె, ఏకంగా నెల రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపి సంచలనం కలిగించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 31 ఏండ్లు పూర్తి చేసుకుని 32వ ఏట అడుగు పెట్టింది.
తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం
రియా చక్రవర్తి జులై 1న బెంగళూరులో సెటిలైన బెంగాలీ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె స్కూలింగ్ అంతా అంబాలా ఆర్మీ పాఠశాలలో కొనసాగింది. 2009లో బుల్లితెరపై నటిగా కెరీర్ మొదలు పెట్టింది. ఎంటీవీ రియాలిటీ షో ‘టీన్ డీవా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో ఆమె రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత అదే టీవీలో ‘ఎంటీవీ వాట్సప్’, ‘టిక్ టాక్ కాలేజ్ బీట్’, ‘ఎంటీవీ గాన్ ఇన్ 60’ సహా పలు షోలకు హోస్టుగా వ్యవహరించింది. అదే సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆమెకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. 2012లో సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన ‘తూనీగా తూనీగా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సౌత్ లో అవకాశాలు కూడా రాలేదు.
హీరోయిన్ రాణించలేకపోయిన రియా
ఆ తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ‘మేరే డాడ్ కీ మారుతి’ అనే సినిమాలో సాకిబ్ సలీంతో కలిసి నటించింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. వెంటనే ‘సోనాలీ కేబుల్’ అనే మూవీలో నటించింది. 2017లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ‘బ్యాంక్ చోర్’లో అవకాశం దక్కింది. ఆ తర్వాత ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘దుబారా: సీ యువర్ ఈవిల్’ లాంటి సినిమాలు చేసింది. 2018లో ‘జలేబీ’ మూవీతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. నిజానికి ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేదు. అందుకే అనుకున్న స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు.
వివాదాలతో రియాకు గుర్తింపు
సినిమాల కంటే వివాదాలతోనే రియా చక్రవర్తి బాగా గుర్తింపు తెచ్చుకుంది. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ తో ప్రేమాయణం కొనసాగించింది. అతడు చనిపోయిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నది. సుశాంత్ మృతికి ఆమే కారణం అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సుశాంత్ మృతి తర్వాత బయటకు వచ్చిన మాదకద్రవ్యాల కేసులో రియా జైలుకు వెళ్లింది. సుమారు నెల రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన 32వ ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు.
Also Read: నేను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా- షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి హీనా ఖాన్