రియా చక్రవర్తి... కథానాయికగా కంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసిగా ఆవిడ పేరు ఎక్కువ వినిపించింది. సుశాంత్ మరణానికి రియా కారణం అని విమర్శించిన ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. సుశాంత్ మరణం రియా మీద ఎంత ప్రభావం చూపించిందంటే... ఆమెకు ఛాన్సులు ఇవ్వడం మానేసేంత! సుశాంత్ మరణంలో రియా ప్రమేయం లేదని తేలడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు రియా '#rhenew' హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొత్త రియాకు ఎంత మంది ఛాన్సులు ఇస్తారో చూడాలి. అన్నట్టు... ఈ మధ్య సైమా అవార్డు ఫంక్షన్‌లో రియా సందడి చేశారు. తెలుగు సినిమా చేసిన అనుభవం ఉన్న ఆమెకు తెలుగులో ఏమైనా అవకాశం లభిస్తుందా? వెయిట్ అండ్ సి రియా చక్రవరి తమ సినిమాలో ఉంటే ప్రేక్షకులు చూడటం మానేస్తారేమోనని గతంలో కొందరు సినిమాల నుంచి తప్పించారు. ఇప్పుడు రియా చక్రవర్తి విషయంలో ఇండస్ట్రీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. (All Images courtesy - @rhea_chakraborty/Instagram)