కృష్ణంరాజు కుటుంబంలో అమ్మాయిల సంఖ్య ఎక్కువ. కుమార్తెలు, కుమార్తెకూ కుమార్తెలు... ఫ్యామిలీ వివరాలు చూడండి. కృష్ణంరాజు మొదటి భార్య పేరు సీతాదేవి. ఆమెకు ఒక కుమార్తె. ఆ అమ్మాయికి వివాహమైంది. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు. కృష్ణంరాజు రెండో భార్య పేరు శ్యామలా దేవి. ఆమెకు ముగ్గురు అమ్మాయిలు. కృష్ణంరాజు, శ్యామలాదేవి దంపతుల కుమార్తెల పేర్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి కృష్ణంరాజు తన సోదరులు, సోదరీమణుల పిల్లలను సొంత పిల్లల వలే చూసేవారు. కృష్ణంరాజుకు అబ్బాయిలు లేరు. తన సోదరుడు సూర్యనారాయణరాజు కుమారుడు ప్రభాస్‌ను నట వారసుడిగా పరిచయం చేశారు. శ్యామల దేవి, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులతో కృష్ణంరాజు ఫొటోలో ఉన్న ఆవిడ పద్మ. పాతికేళ్లుగా కృష్ణంరాజు ఫ్యామిలీ దగ్గర పని చేస్తున్నారు. ఆమెను కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నారు కుమార్తె సాయి ప్రసీదతో కృష్ణంరాజు (All Images courtesy - @praseedhauppalapati/Instagram)