ఐదు పదుల వయసుకి దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ తన ఫిట్నెస్ తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటుంది మలైకా.

సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ.

తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది.

వీరిద్దరూ తరచూ ట్రిప్ లకు, రెస్టారెంట్ లకు వెళ్తూ మీడియా కంట పడుతుంటారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మలైకా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో మలైకా ఎంతో అందంగా కనిపిస్తోంది.

ఆమె లుక్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

డ్రెస్సింగ్ విషయంలో మలైకాను ఎవరూ బీట్ చేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.