Rajasekhar: రాజశేఖర్ హీరోగా అమెజాన్ 60 కోట్ల సినిమా - అందులో నిజమెంత?
Rajasekhar Upcoming Movie: రాజశేఖర్ హీరోగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం 60 కోట్ల బడ్జెట్‌తో ఓ సినిమా రూపొందుతోందని వార్త చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ నిజమేనా? అసలు మ్యాటర్ ఏమిటంటే?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? సీనియర్ హీరోకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందా? అంటే... రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం చూస్తే నిజమే అనిపిస్తుంది. కానీ, అసలు మ్యాటర్ వేరు అని తెలిసింది.
రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!?
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందే భారీ సినిమాలో రాజశేఖర్ హీరోగా యాక్ట్ చెయ్యనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఆయనతో మరో ఇద్దరు యంగ్ హీరోలు ఉంటారని, సుమారు 60 - 70 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తీస్తారని ఫిల్మ్ నగర్ గుసగుస. దానికి నిఖిల్ 'స్పై'తో దర్శకుడిగా పరిచయమై డిజాస్టర్ మూట కట్టుకున్న ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఆ చిత్రానికి దర్శకుడు.
రాజశేఖర్ దగ్గరకు ఆఫర్ వచ్చింది కానీ...
అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమా ఆఫర్ రాజశేఖర్ దగ్గరకు వచ్చింది. ఆయన్ను ఆ సినిమా చెయ్యమని అడిగారు. డిస్కషన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. కథ, క్యారెక్టర్, కమామీషు ఏమీ చెప్పలేదు. ఆ సినిమా చేస్తానని గానీ, చెయ్యనని గానీ ఆయన కూడా చెప్పలేదు. ప్రజెంట్ డిస్కషన్స్ ఎర్లీ స్టేజిలో వున్నాయి. అన్నీ కుదిరితే ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడానికి టైమ్ పడుతుంది.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!
రాజశేఖర్ చేతిలో రెండు సినిమాలు!
Rajasekhar Upcoming Movies 2024 Telugu: ప్రజెంట్ రాజశేఖర్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అది కాకుండా శర్వానంద్ హీరోగా 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామాలోనూ యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. శర్వా తండ్రి పాత్రలో ఆయన యాక్ట్ చేస్తున్నట్టు టాక్. దాని తర్వాత సినిమా ఓకే కావాల్సి ఉంది. అన్నీ కుదిరితే గ్యారీ సినిమా ఉంటుంది.
Also Read: బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?
థియేట్రికల్ సినిమాలకు ధీటుగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వెబ్ సిరీస్‌లు తీస్తున్నాయి. ఆ ట్రెండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ. 'షేర్ షా'తో సిద్ధార్థ్ మల్హోత్రా, 'ఫర్జీ' వెబ్ సిరీస్ & 'బ్లడీ డాడీ' సినిమాతో షాహిద్ కపూర్, 'సేక్రేడ్ గేమ్స్'తో సైఫ్ అలీ ఖాన్, 'ఫ్యామిలీ స్టార్ 2' వెబ్ సిరీస్ తో సమంత... చెబుతూ వెళితే హిందీలో ఓటీటీ ప్రాజెక్టులతో విజయాలు అందుకున్న హీరో హీరోయిన్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. తెలుగులో నాగ చైతన్య 'దూత' వెబ్ సిరీస్ చేశారు. అయితే... సీనియర్ స్టార్ హీరోలు ఇంకా ఓటీటీ స్పేస్‌లోకి రాలేదు. ఓటీటీ సినిమా లేదా వెబ్ సిరీస్ చేసే ఫస్ట్ టాలీవుడ్ సీనియర్ హీరో ఎవరు అవుతారో చూడాలి. వెయిట్ అండ్ సి.
Also Read: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?