Quentin Tarantino - Master of Stylized Violence | హాలీవుడ్ ను రక్తంతో తడిపేసిన డైరెక్టర్ | ABP Desam
సినిమాలు చూసే ఆడియన్స్ లో రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లు ఉంటారు. కొంత మందికి సాఫ్ట్ గా ఉండే ఆనంద్, గోదావరి లాంటి సినిమాలు ఇష్టం. మరికొంత మందికి సలార్, యానిమల్ లాంటి మాస్ మసాలా, బ్లడ్ బాత్ సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది. కొంత మంది డివోషనల్, కొంత మందికి హారర్ ఇలా సినిమాల్లో ఒక్కో జోన్రాకు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలా రీసెంట్ టైమ్స్ ఇండియన్ సినిమాను కమ్మేసిన వయొలెన్స్ సినిమాల ఫీవర్ ను ఒక డైరెక్టర్ 90స్ లోనే హాలీవుడ్ కు పరిచయం చేశాడు. అంతకు ముందు కూడా చాలా మంది బ్లడ్ అండ్ గోర్ ను వెండితెరపై చూపించినా ఈ డైరెక్టర్ చూపినంత కళాత్మకంగా..స్టైలెజ్డ్ వయొలెన్స్ అనే సరికొత్త జోన్రాను క్రియేట్ చేసిన డైరెక్టర్ మాత్రం లేరు. అందుకే క్వింటన్ టరంటినో అనే పేరు బ్రాండ్ లా మారి కల్ట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. హాలీవుడ్ అనే భారీ సినిమా ప్రపంచాన్ని రక్తపాతంతో తడిపేసిన క్వింటన్ టరంటినో ఎవరు..ఏంటీ ఈయన సినిమాల స్పెషాలిటీ ఈ వారం హాలీవుడ్ ఇన్ సైడర్ లో మాట్లాడుకుందాం.





















