అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ బావుందని అంటున్నారంతా! అందులో డైలాగ్స్ ఎలా ఉన్నాయో చూడండి.

మీకు తెలిసిన మంచి సంబంధాలు ఉంటే చెప్పండి... నాకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు - అల్లరి నరేశ్

నేను ఎప్పటి వరకు 200 పెళ్లిళ్లు చేయించా - అల్లరి నరేశ్
ఎందుకు? మీరు పంతులు గారా - ఫరియా అబ్దుల్లా 

నేను మీకు ఏ విధంగా సహాయపడగలను - హరితేజ 
ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నా, ఇప్పిస్తారా? - 'అల్లరి' నరేశ్

లేకపోతే ఏంటండీ... పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి - అల్లరి నరేశ్ 

మాలాంటి పెళ్లి కానీ వాళ్లకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. పెళ్లెప్పుడు అని దొబ్బేవాళ్లను కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి - 'అల్లరి' నరేశ్

49 సంబంధాలు చూసినా పెళ్లి కాక... 50వ సంబంధం సెట్ అవుతుందా? లేదా? అని టెన్షన్ పడుతుంటే పెళ్లాం పిల్లలు అంటావా? - నరేశ్ 

ఇప్పుడున్న సొసైటీలో జాబ్ చేసే అమ్మాయి పెర్ఫెక్ట్ - హరితేజ

మా అమ్మ నాన్నకు ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి, సో నాకు ఇంట్లో ఉండే అమ్మాయిని చూడండి - వైవా హర్ష

ఏదైనా గుంట కనపడితే కట్టేద్దామని పుస్తెల తాడు మెడలో వేసుకుని తిరుగుతున్నా - 'షకలక' శంకర్

వీడేంట్రా బాబు ఇంత కరువులో ఉన్నాడు - హరితేజ