Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Prabhas Donation: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి ఆయన విరాళం అందజేశారు.
![Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే? Prabhas Generously Donates Rs 35 Lakh to Telugu Film Directors Association Welfare Fund Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/23/2f3caeada4845d2a75447c206a535fff1713846327452313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prabhas Donation To Telugu FIlm Directors Association: ప్రభాస్... దేశ ప్రజలందరూ మెచ్చిన 'బాహుబలి'. ఆ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'వీడు ఎక్కడున్నా రాజేరా' అని! ఆ మాట అక్షరాలా నిజమని పరిశ్రమ ప్రముఖులు చెప్పే మాట. ప్రభాస్ మంచితనం గురించి ప్రేక్షకులకూ తెలుసు. ఏపీలో అనూహ్య వరదలు, వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి ఆ మధ్య పది లక్షల రూపాయల విరాళం అందజేశారు. తాజాగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి విరాళం అందించారు.
తెలుగు దర్శకుల సంఘం సంక్షేమ నిధికి రూ. 35 లక్షల విరాళం
ప్రజలకు మాత్రమే కాదు... పరిశ్రమలో వ్యక్తులకు ఆపద ఎదురైనట్టు తన దృష్టికి వస్తే పెద్ద మనసుతో సాయం చేసే హీరోలలో ప్రభాస్ ఒకరు. చిత్రసీమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా సరే అందులో ఆయన కూడా భాగం అవుతారు. రెబెల్ స్టార్ ప్రభాస్ తన వంతు ఆర్థిక సహాయం అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. ఇప్పుడు మరోసారి అటువంటి మంచి పని చేశారు.
దర్శక రత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4ను 'డైరెక్టర్స్ డే'గా అనౌన్స్ చేసింది తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (Telugu Film Directors Association). ప్రతి ఏడాదీ దాసరి జయంతికి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో భారీగా సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ విషయం తెలిసి... తెలుగు దర్శకుల సంఘం సంక్షేమ నిధికి ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు.
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సోమవారం నాడు 'డైరెక్టర్స్ డే' ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించింది. అందులో పాల్గొన్న దర్శకుడు మారుతి... ప్రభాస్ విరాళం ఇస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా హీరోకి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు చప్పట్లతో తమ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!
మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' చేస్తున్న ప్రభాస్
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. అదే 'రాజా సాబ్' (Raja Saab Movie Prabhas). హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది.
'రాజా సాబ్' కాకుండా 'కల్కి 2989 ఏడీ' సినిమా (Kalki 2989 AD Movie)లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ముందుగా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు కాకుండా 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేసేందుకు ప్రభాస్ ఎస్ చెప్పారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Also Read: బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)