Tollywood: అక్టోబర్ బాక్సాఫీస్ రివ్యూ.. సరైన సినిమా ఒక్కటీ పడలేదే..
మంచి కంటెంట్ పడితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారనే విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే అక్టోబర్ నెలలో అలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సరైన సినిమా ఒక్కటి కూడా పడలేదు.
కరోనా తరువాత థియేటర్ వ్యవస్థ గాడిన పడింది. మంచి కంటెంట్ పడితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారనే విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే అక్టోబర్ నెలలో అలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సరైన సినిమా ఒక్కటి కూడా పడలేదు. సాయిధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమాతో అక్టోబర్ బాక్సాఫీస్ రన్ మొదలైంది. కానీ ఆ సినిమా మంచి స్టార్ట్ అందించలేకపోయింది. దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎంటర్టైన్ చేసే అంశాలు లేకపోవడంతో ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు.
ఈ సినిమాతో పాటు విడుదలైన 'ఇదే మా కథ', 'ఆట నాదే వేట నాదే' సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. 'రిపబ్లిక్' వచ్చిన వారం గ్యాప్ లోనే సాయి ధరమ్ తేజ్ తప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమా విడుదలైంది. క్రిష్-వైష్ణవ్ తేజ్-రకుల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'కొండపొలం'. 'ఉప్పెన'తో భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్.. 'కొండపొలం'తో నిరాశ పరిచాడు.
Also Read: 'Heroes Don't Exist'.. మాస్ హీరో కోసం మరో కొత్త కాన్సెప్ట్..
నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అటు ఆర్ట్ ఫిల్మ్ గా తీయలేక.. ఇటు కమర్షియల్ ఫార్మాట్ లోకి మార్చలేక ఇబ్బంది పడ్డాడు దర్శకుడు. ఫలితం కూడా అటు ఇటుగానే వచ్చింది. ఈ సినిమాతో పాటు గోపీచంద్ నటించిన 'ఆరడుగుల బుల్లెట్' సినిమా కూడా విడుదలైంది. కానీ ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక దసరా బరిలో 'మహాసముద్రం', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'పెళ్లిసందD' సినిమాలు నిలిచాయి.
వీటిలో 'మహాసముద్రం' సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తరువాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'కి ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. హిట్ అని నిరూపించడానికి చాలానే కష్టపడ్డారు. సినిమాలో పాటలు, పూజాహెగ్డే లుక్ సినిమాకి పాజిటివ్ అంశాలుగా నిలిచాయి. 'పెళ్లిసందD' సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్స్ ను మాత్రం రాబట్టగలిగింది.
దసరా సీజన్ తరువాత ఏకంగా అరడజను సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటీ కూడా ఆడలేదు. భారీ ప్రమోషన్ తో వచ్చిన 'నాట్యం' సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక ఈ నెలకి ఫినిషింగ్ టచ్ గా వచ్చిన 'వరుడు కావలెను', 'రొమాంటిక్' సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 'రొమాంటిక్' సినిమాతో పోలిస్తే.. 'వరుడు కావలెను' సినిమా మాత్రం చాలా బెటర్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
Also Read: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ
Also Read: ఏడాదిన్నర ఎదురుచూశా.... పవన్ కల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజమౌళి
Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!
Also Read: అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి