News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NBK Unstoppable: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం నందమూరి బాలకృష్ణ 'Unstoppable' పేరుతో టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ తొలి ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. ఆ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది.

FOLLOW US: 
Share:

'మాటల్లో ఫిల్టర్ ఉండదు... సరదాలో స్టాప్ ఉండదు! సై అంటే సై... నై అంటే నై' అంటూ 'అన్ స్టాపబుల్' టాక్ షోపై అంచనాలు పెంచేశారు నట సింహం నందమూరి బాలకృష్ణ. ఫర్ ద ఫస్ట్ టైమ్... సెలబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నారు. 'వన్స్ ఐ స్టెప్ ఇన్... హిస్టరీ రిపీట్స్' (ఒక్కసారి నేను అడుగు వేస్తే... చరిత్ర పునరావృతం అవుతుంది) అంటూ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. దెబ్బకు ఆలోచన మారిపోవాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఆయన్ను చాలామంది ఇంటర్వ్యూ చేశారు. ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే... ఆయన సెలబ్రిటీలను ఎలా ఇంటర్వ్యూ  చేస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆ ఆసక్తికి తెర దించుతూ ఈ రోజు (ఆదివారం) తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు మంచు, కుమార్తె లక్ష్మీ మంచు 'అన్ స్టాపబుల్' టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కి అతిథులుగా వచ్చారు. ఎన్టీఆర్ సినిమాల్లో మోహన్ బాబు నటించారు. మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాలో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించారు. నందమూరి, మంచు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడీ 'అన్ స్టాపబుల్' ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఆ సాన్నిహిత్యం కనిపించింది.

సినిమాలు, సరదాగా సంగతులు మాత్రమే కాదు... రాజకీయాలు కూడా బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య చర్చకు వచ్చాయి. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుని మోహన్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణతో రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చారు.  "ఈ బాధలో నిన్నొక విషయం అడుగుతా... తెలుగుదేశం స్థాపించినది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం ఆ పగ్గాలు మీరు చేతిలోకి తీసుకోకుండా... చంద్రబాబుకు ఎందుకిచ్చావ్?" అని బాలకృష్ణను మోహన్ బాబు సూటిగా ప్రశ్నించారు. అప్పుడు 'ఆ ఒక్కటీ...' అని బాలకృష్ణ వేలు చూపించారు. ఏం చెప్పారనేది దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానున్న ఎపిసోడ్ లో చూడాలి. "అన్నగారి పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది?" అని బాలకృష్ణ కూడా మోహన్ బాబును ప్రశ్నించారు.

Also Read: ఏడాదిన్న‌ర ఎదురుచూశా.... ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజ‌మౌళి

బాలకృష్ణ అడుగుతుంటే... అల్లు అరవిందే ఈ  ప్రశ్నలు అడగమని ఉంటాడని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. లక్ష్మీ మంచు, విష్ణు మంచు కూడా 'అన్ స్టాపబుల్'లో సందడి చేశారు. బాలకృష్ణతో కలిసి 'దంచవే మేనత్త కూతురా...' పాటకు లక్ష్మీ మంచు స్టెప్పులు వేశారు. 'అనిపించింది అందాం... అనుకున్నది చేద్దాం... ఎవరు ఆపుతారో చూద్దాం' అని బాలకృష్ణ ప్రోమోకి ఎండింగ్ ఇచ్చారు. 

Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!

Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?

Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 31 Oct 2021 11:26 AM (IST) Tags: Nandamuri Balakrishna Balakrishna Vishnu Manchu Mohanbabu Lakshmi Manchu NBK Unstoppable Unstoppable First Episode Promo NBK Unstoppable First Episode Promo Manchu Family Unstoppable Episode Promo UnstoppableWithNBK

ఇవి కూడా చూడండి

Tiger Nageswara Rao: కొత్త ఐడియాతో ‘టైగర్ నాగేశ్వర రావు’ - ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాని భాషలో!

Tiger Nageswara Rao: కొత్త ఐడియాతో ‘టైగర్ నాగేశ్వర రావు’ - ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాని భాషలో!

Suma Adda : సుమను ఘోస్ట్ అనేసిన సుధీర్ బాబు - ‘అల్లూరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు!

Suma Adda : సుమను ఘోస్ట్ అనేసిన సుధీర్ బాబు - ‘అల్లూరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు!

Ranbir Kapoor: రణబీర్ కపూర్‌‌ను విచారించనున్న ఈడీ - ఆ ప్రకటనే కొంప ముంచిందా?

Ranbir Kapoor: రణబీర్ కపూర్‌‌ను విచారించనున్న ఈడీ - ఆ ప్రకటనే కొంప ముంచిందా?

Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

Bhagavanth Kesari: సప్పుడు చెయ్యకురి, నీకన్నా మస్తుగా ఉరుకుతాంది - ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!

Bhagavanth Kesari: సప్పుడు చెయ్యకురి, నీకన్నా మస్తుగా ఉరుకుతాంది - ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!

టాప్ స్టోరీస్

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Constable Results: తెలంగాణ  కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!

Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!