Aadhi Pinisetty: నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి ఎంగేజ్మెంట్, ఇవిగో ఫొటోలు
నటుడు ఆది పినిశెట్టికి హీరోయిన్ నిక్కీతో ఎంగేజ్మెంట్ జరిగింది.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట. మార్చి 24న స్నేహితులు, బంధువుల సమక్షంలో వీరికి నిశ్చితార్ధం జరిగినట్లు వెల్లడించారు. త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'బుజ్జిగాడు' సినిమా ఫేమ్ సంజనా గల్రానీ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిక్కీ గల్రానీ. కోలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. 'యాగవరాయినుం నా కాక్క' అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నటించింది నిక్కీ. ఈ సినిమాను తెలుగులో 'మలుపు' పేరుతో విడుదల చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. మొత్తానికి ఈ జంట సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేసి ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట.
ఇక ఆది పినిశెట్టి విషయానికొస్తే.. ఆయన హీరోగా, విలన్ గా కొన్ని సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఆది నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తోన్న 'ది వారియర్' సినిమాలో విలన్ గా కనిపించనున్నారు ఆది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: ప్రభాస్ కోసం 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ షో, ఎప్పుడంటే?
Also Read: స్టార్ హీరో విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram