అన్వేషించండి

Netflix: ఇకపై ఆ తప్పు చేయబోం- ‘IC 814’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నెట్‌ ఫ్లిక్స్‌

‘IC 814: ది కాందహార్‌ హైజాక్’ వెబ్ సిరీస్ పై తీవ్ర వివాదం చెలరేగిన నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ వివరణ ఇచ్చింది. ఇకపై దేశ ప్రజల మనోభావాలకు భంగం కలిగించే కంటెంట్ తమ ఓటీటీ కనిపించదని వెల్లడించింది.

Netflix India Statement On ‘C814: The Kandahar Hijack’ Row: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్’పై గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ అంశంపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం నెట్ ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. వివాదాస్పద అంశాలపై క్లారిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెట్ హెడ్ మోనికా షెర్గిల్ తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు ముందు హాజరయ్యారు. వెబ్ సిరీస్ కు సంబంధించిన పలు విషయాలపై వారికి వివరణ ఇచ్చారు.  

ఇకపై ఆ పొరపాటు చేయబోమని హామీ

మోనికా షెర్గిల్ సుమారు 40 నిమషాల పాటు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులకు తన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ విచారణంలో భాగంగా హైజాకర్ల అసలు పేర్లను ఎందుకు వెల్లడించలేదు? వారికి హిందువుల పేర్లు ఎందుకు పెట్టారు? హైజాకర్లను సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు ఎందుకు చూపించారు? చర్చలు జరిపే వారిని బలహీనులుగా ఎందుకు ప్రొజెక్ట్ చేశారు?” అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమ వెబ్ సిరీస్ లోని పూర్తి కంటెంట్ ను మరోసారి పరిశీలిస్తామని మోనికా షెర్గిల్  వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇక ముందు తమ ఓటీటీలో దేశ ప్రజల మనోభావాలను వ్యతిరేకంగా ఉండే ఎలాంటి కంటెంట్ ను ప్రదర్శించబోమని వెల్లడించారు. పిల్లలకు సంబంధించిన కంటెంట్ విషయాలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని నెట్ ప్లిక్స్ ప్రకటించింది.

అసలు వివాదం ఏంటంటే?

1999లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ కథాంశంతో రీసెంట్ గా  ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్‌’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యింది అయితే, ఈ విమానాన్ని హైజాక్ చేసింది పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదులు.  ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్  విమాన హైజాక్ లో పాల్గొన్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్ లో హైజాకర్ల పేర్లను మార్చారు. వాస్తవ ఘటనలో ముస్లీం టెర్రరిస్టులు పాల్గొనగా, ఈ వెబ్ సిరీస్ లో విమాన హైజాక్ లో పాల్గొన్న వారి పేర్లు భోళా, శంకర్, బర్గర్, డాక్టర్  అని పెట్టారు.  వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చూపించారు. దీంతో వివాదం మొదలయ్యింది. వెబ్ సిరీస్ మేకర్స్ కావాలనే ముస్లిం పేర్లకు బదులుగా హిందువు పేర్లు పెట్టి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది.

ఇక ఈ వెబ్ సిరీస్ ను కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన ‘ఫ్లైట్‌ ఇన్‌టూ ఫియర్’ బుక్ ఆధారంగా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ, అరవింద్ స్వామి, కునాల్ చోప్రా, కరణ్ దేశాయ్ నసీరుద్దీన్ షా కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్  హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.      

Read Also: వివాదంలో తమన్నా బాయ్ ఫ్రెండ్ వెబ్ సిరీస్- నెట్‌ఫ్లిక్స్‌ పై కేంద్రం ప్రభుత్వం సీరియస్

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
Bigg Boss Season 10 Today Nov 14th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Dhindora Series Season 2 OTT : మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget