Naveen Polishetty: రూ.4 కోట్లు తిరిగిచ్చేసిన నవీన్ పోలిశెట్టి.. నిర్మాతలకు షాకిచ్చిన జాతిరత్నం
నవీన్ పోలిశెట్టి.. ఓ సినీ నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న రూ.4 కోట్ల పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశాడట.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో బోలెడంత క్రేజ్ సంపాదించిన నవీన్ పోలిశెట్టి.. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అవకాశాలు వస్తున్నాయని కంగారు పడకుండా మంచి కథలను ఎంపిక చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఇటీవల నవీన్.. ఓ నిర్మాణ సంస్థకు ఊహించని షాకిచ్చాడు. ఆ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాడు. నవీన్ అలా ఎందుకు చేశాడంటే..
ఆ రెండు సినిమాల హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టికి అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సందర్భంగా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ నుంచి నవీన్ పోలిశెట్టి అడ్వాన్సులు తీసుకున్నాడు. అయితే, ఇప్పటివరకు నవీన్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలు ఏవీ అభిమానులతో పంచుకోలేదు.
నవీన్ పోలిశెట్టి ఓ సినిమా కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది. ‘జాతిరత్నాలు’ సినిమా రైటింగ్ డిపార్ట్మెంట్లో కీలకంగా పనిచేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడి స్టోరీకి నవీన్ తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అతడు వినిపించిన కథలో కొన్ని మార్పులు చేయాలని నవీన్ సూచించించినట్లు సమాచారం. అయితే, అప్పటికీ ఆ కథ నవీన్ అనుకున్నంత బాగా రాకపోవడంతో ఆ సినిమా చేయలేనని చెబుతూ నవీన్ సితార ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి తీసుకున్న అడ్వాన్స్ సుమారు రూ.4 కోట్ల పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశాడని తెలిసింది.
Also Read: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!
రొటీన్ కథలు కాకుండా కొత్తగా అనిపించే చిత్రాలను చేయాలనే లక్ష్యంగా నవీన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ యువీ క్రియేషన్స్ కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. ఈ చిత్రం షూటింగ్ దసరా నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో హీరోయిన్ అనుష్క కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, అనుష్క ఈ సినిమా చేసేందుకు నిరాకరించడంతో ఈ ప్రాజెక్ట్‌కు కూడా బ్రేక్ పడిందనే ప్రచారం జరిగింది. నవీన్ మరోసారి ‘జాతిరత్నం’ దర్శకుడితో మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Also Read: టాలీవుడ్ డర్టీ పిక్చర్‌లో ఊహించని ట్విస్ట్.. డ్రగ్స్ కేసులో లొంగిపోయిన కీలక నిందితుడు
Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..