News
News
X

Money Heist Season 5: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!

‘మనీ హీస్ట్’ చివరి భాగం సెప్టెంబరు 3 నుంచి ప్రసారం కాబోతుంది. అయితే, ఈ సీజన్‌లో ప్రొఫెసర్ చనిపోతారా?

FOLLOW US: 

‘మనీ హీస్ట్’.. ఇండియాలో అత్యధిక ఓటీటీ ప్రేక్షకుల ఫేవరెట్ వెబ్‌సీరిస్ ఇది. ఇందులో ప్రొఫెసర్ పాత్రకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే, ఇన్ని రోజులు ఈ వెబ్‌సీరిస్ స్పానిష్ భాషలోనే ప్రసారమయ్యేది. అయితే, ఇండియాలో ఈ సీరిస్‌కు లభిస్తున్న ఆధరణ దృష్టిలో పెట్టుకుని తెలుగుతోపాటు హిందీ, తమిళ్ తదితర భాషల్లోకి కూడా అనువాదించారు. ప్రపంచంలో.. అత్యధిక ప్రేక్షకులు వీక్షించే పరభాష వెబ్ సీరిస్ ఇదే కావడం గమనార్హం. ఇంగ్లీష్ వెబ్‌సీరిస్‌లను తలదన్ని మరీ ఈ వెబ్‌సీరిస్ ముందుకు దూసుకెళ్తుందంటే.. ఇది ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, రెండు సీజన్లు.. నాలుగు పార్టులుగా ప్రసారమైన ఈ వెబ్‌సీరిస్ 5వ పార్టుతో ముగియనున్నట్లు సమాచారం. 

భారతీయ భాషల్లో ‘మనీహీస్ట్’: ఇప్పటివరకు స్పానిష్ భాషలోనే నేరుగా ఈ సీరిస్‌ను ప్రసారం చేసేవారు. ఆ తర్వాత దాన్ని ఇతర భాషల్లోకి అనువాదించేవారు. కానీ, ఈ సారి మాత్రం నేరుగా తెలుగు తదితర భాషల్లోకి అనువాదించి ఈ వెబ్‌సీరిస్‌ను విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ వెబ్‌సీరిస్ తెలుగు ట్రైలర్‌‌ను తెలుగు ప్రేక్షకులు పండుగ చేసుకున్నారు. సెప్టెంబరు 3 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో రెండో సీజన్ చివరి పార్టు స్ట్రీమింగ్ కానుంది. చివరి భాగంలో మాస్టర్ మైండ్ ప్రొఫెసర్ చనిపోతారనే ప్రచారం జరుగుతుంది. అతడి తర్వాత ప్రొఫెసర్ గర్ల్‌ఫ్రెండ్, మాజీ పోలీస్ అధికారిని రకెల్ ఆ దోపిడీ బాధ్యతలను స్వీకరిస్తుంది. 

పార్ట్ 5.. ట్రైలర్ ప్రకారం..: సీజన్-2లో పోలీసులకు పట్టుబడిన రియోను కాపాడేందుకు ప్రోఫెసర్ మరోసారి ఘరానా దోపిడీకి ప్లాన్ వేసి పోలీసులకు హెచ్చరికలు పంపుతాడు. ఆ దోపిడీని అడ్డుపెట్టుకుని రియోను విడిపించాలనేది ప్రొఫెసర్ అసలైన ప్లాన్. ఈ సందర్భంగా ‘బ్యాంక్ ఆఫ్ స్పెయిన్’లో దోపిడీకి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వారికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. ఆ దోపిడీ ముఠాలో కీలకమైన నైరోనబీని ఆ బ్యాంక్ గవర్నర్ బాడీ గార్డ్ గాందియా చంపేస్తాడు. బయట నుంచి ఈ దోపిడీని నడిస్తున్న ప్రొఫెసర్ సైతం పోలీసులకు పట్టుబడతాడు.

మరోవైపు బ్యాంక్ దోపిడీ ముఠాను చంపేందుకు భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దింపుతారు. మరి, ప్రొఫెసర్ ప్లాన్ ఫలిస్తుందా? ఆ ముఠాలో సభ్యులంతా ప్రాణాలతో బయటపడతారా? సైన్యాన్ని ఎలా ఎదుర్కొంటారు? అనేది పార్ట్-5లో చూడాల్సిందే. అయితే, చివరి సీజన్‌లో ప్రొఫెసర్ చనిపోతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రకేల్.. టోక్యో తదితర ముఠా సభ్యులకు ధైర్యం చెప్పి.. సైన్యంతో పోరాడుతుందని తెలుస్తోంది. సీజన్ మొదటి నుంచి దోపిడీ గురించి నరేట్ చేస్తున్న టోక్యో.. ఈ సారి తన గతం గురించి చెప్పనున్నట్లు తెలుస్తోంది. 

‘మనీ హీస్ట్’ వెబ్‌సీరిస్.. 2017లో ప్రారంభమైంది. అయితే, అప్పటికి ఇండియాలో ఓటీటీలకు పెద్దగా ఆధరణ ఉండేది కాదు. అయితే, కరోనా వైరస్ త్వర్వాత విధించిన లాక్‌డౌన్ వల్ల ప్రజలు క్రమేనా ఓటీటీలకు అలవాటు పడ్డారు. దీంతో ‘మనీ హీస్ట్’, హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘మీర్జాపూర్’ వంటి వెబ్‌సీరిస్‌లను చూడటం ప్రారంభించారు. ‘మనీ హీస్ట్’ సీజన్ 1లో ప్రొఫెసర్ ముఠా రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్‌ను దోచుకుంటారు. ఆ తర్వాత ఓ సొరంగం ద్వారా తప్పించుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

‘మనీ హీస్ట్’ పార్ట్-5 తెలుగు ట్రైలర్:

సీజన్-2లో రియో చేసే తప్పిదం వల్ల మళ్లీ కష్టాలు మొదలవుతాయి. అతడి శాటిలైట్ ఫోన్ ఉపయోగించడం వల్ల పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేస్తారు. ఈ రెండు సీజన్లను నాలుగు పార్ట్‌లు, 31 ఎపిసోడ్స్‌గా ప్రసారం చేశారు. ప్రొఫెసర్ పాత్రతో అల్వరో మర్టో భారతీయ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. రాకేల్ మరిల్లో, టోక్యో, బెర్లిన్, రియో, డెన్వర్, బోగట్టా, మాస్కో పాత్రలకు కూడ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, మొదటి నుంచి చురుగ్గా ఉంటూ ఆకట్టుకొనే నైరోబీ చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఈ ముఠాలోని ఓస్లో, మాస్కో, బెర్లిన్‌లు చనిపోయారు. మరి పార్ట్-5లో ఎవరు మిగులుతారో చూడాలి. ప్రస్తుతం ఈ వెబ్‌సీరిస్‌కు చెందిన అన్ని పార్టులు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

‘మనీ హీస్ట్’పై హైప్ క్రియేట్ చేస్తున్న సాంగ్ ఇది:

Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?

Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?

Published at : 31 Aug 2021 06:39 PM (IST) Tags: Money Heist 5 Money Heist Season 5 Money Heist Part 5 Money Heist Professor Money Heist in Telugu మనీ హీస్ట్ మనీ హీస్ట్ 5

సంబంధిత కథనాలు

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

టాప్ స్టోరీస్

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?