News
News
X

Dasara Movie Teaser Date: ‘దసరా’ టీజర్ డేట్‌ ప్రకటన - మంట పెట్టేశారుగా!

నాని, కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ మూవీ టీజర్‌ చూడాలని ఉందా? అయితే, మరో ఐదు రోజులు వేచి చూడండి.

FOLLOW US: 
Share:

నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైపోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్ మూవీపై అంచనాలు పెంచేశాయి. నాని, కీర్తి సురేష్‌లు ఇప్పటికే ‘నేను లోకల్’ మూవీతో హిట్ కొట్టేశారు. ఈ నేపథ్యంలో ‘దసరా’ మూవీపై కూడా నాని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. 

సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని మార్చి 30న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దసరా’ టీజర్‌ను ముస్తాబు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందటే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే, ఈ మూవీ షూటింగ్ దశలోనే అదిరిపోయే బిజినెస్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి రూ.100 కోట్ల బిజినెస్ జరిగిపోయిందని టాలీవుడ్ టాక్. కొత్త దర్శకుడితో.. నాని లాంటి మిడ్ రేంజ్ హీరో నటించిన ఈ సినిమాకు వంద కోట్లు బిజినెస్ జరిగిందంటే నిజంగా గ్రేటే. దీంతో ఈ మూవీకి పెట్టిన సుమారు రూ.50 కోట్ల పెట్టుబడికి న్యాయం జరుగుతుందని నిర్మాత సుధాకర్ భావిస్తున్నారు. 

ఇక టీజర్ డేట్ విషయానికి వస్తే.. జనవరి 30న విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని బుధవారం సోషల్ మీడియా ద్వారా సరికొత్తగా వెల్లడించారు. టీజర్ డేట్ ప్రకటన వీడియోను ఇక్కడ చూడండి. 

అమెజాన్ చేతికి నాన్ థియేట్రికల్ రైట్స్?

‘దసరా’ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకుందని, ఇందుకు రూ.30 కోట్లు ఆఫర్ చేసిందని సమాచారం. ఇతర భాషలకు చెందిన రైట్స్‌కు మరో రూ.10 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ.20 కోట్లు వచ్చాయట. అంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.60 కోట్లు ఈ మూవీకి వచ్చేశాయ్. ఇక థియేటర్‌లో బొమ్మ పడి.. హిట్ టాక్ సొంతం చేసుకుంటే నిర్మాతకు నిజంగా ‘దసరా’ పండుగే. ఎందుకంటే.. ‘దసరా’ సినిమాకి రూ.40 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయట. అంటే మొత్తం కలుపుకొని రూ.100 కోట్లన్నమాట. నాని కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ అని చెప్పుకోవాలి. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి! 

గోదావరి ఖని నేపథ్యంలో..

తెలంగాణలోని గోదావ‌రిఖ‌ని సమీపంలో ఉన్న సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ కంప్లీట్ కాగా.. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలయినట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌, నవీన్ నూలి ఎడిటర్‌.

Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో యువ హీరోకి ఛాన్స్ - సిరీస్ నుంచి సినిమాకు 

'దసరా'లో ఇంటెన్స్ లవ్ స్టోరీ

ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ లవ్ ప్లాట్ ప్లాన్ చేశారు దర్శకుడు. రిచ్ అమ్మాయి.. స్లమ్ లో ఉండే అబ్బాయిని ప్రేమించడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 'దసరా' సినిమాలో కూడా ఇలాంటి ఒక లవ్ స్టోరీని చూపించబోతున్నారు. రాజుగారి కోట లాంటి ఇంట్లో ఉండే హీరోయిన్.. స్లమ్ లో ఉండే హీరోని ప్రేమిస్తుంది. ఈ ఎపిసోడ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.   

Published at : 25 Jan 2023 06:47 PM (IST) Tags: nani Keerthy Suresh Dasara Teaser Dasara Teaser Announcement

సంబంధిత కథనాలు

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

Guppedantha Manasu February 3rd Update: రాజీవ్ అరెస్ట్ తో రిషికి నిజం తెలిసిపోయింది, తనెవరో తెలియాలన్న రిషికి ఫజిల్ వదిలేసిన వసు!

Ennenno Janmalabandham February 3rd: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు

Ennenno Janmalabandham February 3rd: యష్, వేద క్యూట్ రొమాన్స్- పెళ్లి చేసుకుంటానని మాళవికకి మాటిచ్చిన అభిమన్యు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!