X

Balakrishna-GopiChand Malineni: 'స్వామీజీ'గా టర్న్ అవుతున్న 'అఘోరా' బాలయ్య, నందమూరి అభిమానులకు పూనకాలే...

నందమూరి నటసింహం ప్రాజెక్ట్స్ , అందులో క్యారెక్టర్స్ పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే 'అఘోర' గా నటిస్తోన్న బాలయ్య త్వరలో మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నారట..

FOLLOW US: 

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న హీరో ఎవరంటే బాలకృష్ణ అంటున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ ఎంట్రీతో హడావుడి ఓ రేంజ్ లో జరుగుతోంది. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న  యాక్షన్ డ్రామా “అఖండ” ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇందులో  ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్,  శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా  నైజాం రైట్స్  కోసం దిల్ రాజు రూ.19 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీస్ లెజెండ్, సింహా తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో కావడంతో 'అఖండ' పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తుంగా ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైలన లుక్, టీజర్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. అఘోరా గా బాలయ్య విశ్వరూపం చూపిస్తాడని ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే తన తదుపరి సినిమా కోసం కూడా నటసింహం క్రేజీ క్యారెక్టర్లో కనిపిస్తారని టాక్. 
Also Read:  4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో డ్యూయెల్ రోల్ చేయబోతున్న నటసింహం ఒక పాత్రలో స్వామీజీగా కనిపించనున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇందులో  బాలయ్య సరసన త్రిష హీరోయిన్ అని తెలుస్తోంది. గోపీచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో, క్రాక్ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
Also Read: కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమే.. మెంటార్‌గా మహేంద్రుడి ఎంట్రీ!
వెండితెర సంగతి పక్కనపెడితే బాలయ్య తొలిసారిగా  బిగ్ స్క్రీన్ నుంచి డిజిటల్ ఫ్లాట్ ఫాంపై  తొలి అడుగు వేశారు. ఆహాలో 'అన్ స్టాబబుల్' అంటూ ఓక టాక్ షో  చేయనున్నారు. దీనికి సంబంధించి ఎపిసోడ్ కి రూ.40 లక్షలు చొప్పున  మొత్తం 12 ఎపిసోడ్స్ గా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే దాదాపు రూ.5 కోట్లు  రెమ్యునరేషన్ దక్కుతుందని  లెక్కలేస్తున్నారు. వాస్తవానికి ఓ సినిమా చేయాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది  పడుతుంది. అదే టాక్ షో అయితే మూడు నెలల్లో ముగుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే బాలయ్యకి మంచి పారితోషికం అన్నట్టే లెక్క. పైగా నందమూరి నటసింహం ఇప్పటివరకూ ఏ సినిమాకు ఐదారుకోట్లకు మించి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ టాక్ షో తో మంచి రెమ్యునరేషన్ రావడంతో ఇక సినిమాలకు సంబంధించి కూడా  బాలకృష్ణ దాదాపు పదికోట్లు దాటి తీసుకుంటారేమో అంటున్నారు.  న‌వంబ‌ర్ 4 నుంచి ప్ర‌సారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నార‌న్నది  ఆస‌క్తిగా మారింది.  ఈ షోలో చిరంజీవి, రామ్ చరణ్ తో కలసి పాల్గొంటారని , ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని, నాగార్జున కూడా చైతూ, అఖిల్ తో కలసి షో లో పార్టిసి పేట్ చేయనున్నారని అంటున్నారు. ఓవరాల్ గా బాలకృష్ణ వెండితెర, ఓటీటీలో మాంచి జోరుమీదున్నారన్నమాట.
Also Read: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
Also Read: ఇన్ స్టాలో ఫుడ్ ఫోటోలు షేర్ చేసే వారికి ఓ హెచ్చరిక... బరువు పెరుగుతారు జాగ్రత్త
Also Read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Akhanda Nandamuri Balakrishna Boyapati Srinu Once Again Crazy Role Director Gopichand

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Saiteja Helicopter Crash : త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Saiteja Helicopter Crash :  త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..!  కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?

Mi 17V Helicopter :  వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?