Chiranjeevi Hand Sugrery: మెగాస్టార్ చేతికి కట్టు.. ఏం అయిందనే ఆందోళనలో ఫ్యాన్స్!
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఎంతోమందికి సేవ చేసినందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ఇన్‌చార్జ్‌లను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
కరోనావైరస్ సెకండ్ వేవ్ సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్టు, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ఎంతో మందికి సేవ చేసినందుకు వాటి ఇన్‌చార్జ్‌లను కలిసి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా చిరంజీవి కుడిచేతికి కట్టుతో రావడం చర్చనీయాంశం అయింది. చిరంజీవి చేతికి ఏం అయింది అంటూ ఫ్యాన్స్ ట్వీటర్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుడి చేతికి ఏమైందని మెగాస్టార్‌ను అడిగితే.. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని ఆయన చెప్పారు. కుడిచేత్తో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరిగా ఉండటంతో వైద్యులను కలిసినట్లు వెల్లడించారు. మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ అంటారని డాక్టర్లు చెప్పారన్నారు.
అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యథావిధిగా పని చేస్తుందని తెలిపారు. దీని కారణంగా ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదన్నారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరి సేవలను గుర్తించిన మెగాస్టార్.. హైదరాబాద్‌లోని రక్తనిధి కేంద్రంలో తెలంగాణలోని అభిమానులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా కారణంగా అభిమానుల్ని కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. ఆక్సిజన్ కొరతతో గొల్లపల్లిలో చాలా మంది చనిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఆ ఘటనతోనే ఆక్సిజన్ బ్యాంకు ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు. దుబాయ్, గుజరాత్, వైజాగ్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించామని తెలిపారు. రెండో దశలో 3వేలకు పైగా సిలిండర్లు తయారు చేయించామన్నారు. ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణలో అభిమానుల సేవలు గర్వకారణమని ప్రశంసించారు. వచ్చే వారం ఏపీ అభిమాన సంఘాలతో చిరంజీవి సమావేశం కానున్నారు.
Mega Star @KChiruTweets garu met with @Chiranjeevi_CT telangana #ChiranjeeviOxygenBank incharges and appreciated them for their tremendous work during Covid-19 second wave
— SivaCherry (@sivacherry9) October 17, 2021
He always there in helping out the ppl who are in need and for his people #JaiChiranjeeva❤️🙏 pic.twitter.com/R3yZc1SUdU
కరోనా క్రైసిస్ లో ఆక్సిజన్ బ్యాంక్ సేవలందించిన మెగాభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
— Suresh Kondeti (@santoshamsuresh) October 17, 2021
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభి pic.twitter.com/k0inL5giCS
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి