Tallest Actress in Bollywood: బాలీవుడ్ లో పొడుగుకాళ్ల సుందరాంగుల్లో టాప్ 5 లో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
Bollywood News: బాలీవుడ్ లో ఎక్కువ హైట్ ఉన్న హీరోయిన్ ఎవరు? అందరూ దాదాపు ఒకే హైట్ లో ఉన్నట్టు కనిపిస్తారు..మరి టాప్ 5 లో ప్లేస్ ఎవరికి?

Tallest Actress in Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్, ఫిట్నెస్ విషయంలో పోటాపోటీగా ఉంటారు. రంగుల ప్రంపంచంలో రాణించాలంటే లుక్ తో పాటూ పర్ఫెక్ట్ హైట్ కూడా ఉండాలి. మరి ఇప్పుడున్న బాలీవుడ్ హీరోయిన్స్ లో ఎవరు ఎక్కువ హైట్ ఉన్నారు? ఏ హీరోయిన్ల పక్కన హీరోలు చిన్నగా కనిపిస్తారు? ఏ హీరయిన్స్ ని తీసుకోవాలంటే మేకర్స్ ఆలోచనలో పడతారు? ఇంతకీ బాలీవుడ్ ఇండస్ట్రీలో పొడుగు పిల్ల ఎవరు?
యుక్తా ముఖి బాలీవుడ్ లోనే పొడవైన నటి
బాలీవుడ్ నటి 1999 మిస్ వరల్డ్ యుక్తా ముఖి బీటౌన్లో పొడుగు నటి అంటారు. యుక్తా ముఖి హైట్ 5 అడుగుల 11 అంగుళాలు. ఈమె హీల్స్ వేసుకుంటే బిగ్ బీ కన్నా పొడుగ్గా కనిపిస్తుందట. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంది యుక్తాముఖి
View this post on Instagram
కత్రినా కైఫ్
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ హైట్ దీపికతో సమానంగా ఉంటుంది. ఇద్దరి హైట్ 5 అడుగుల 9 అంగుళాలు. కత్రినా కైఫ్, శ్రీరామ్ రాఘవన్ మూవీ 'మేరీ క్రిస్మస్'లో విజయ్ సేతుపతితో కలసి నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ఇప్పటివరకూ అనౌన్స్ చేయలేదు
View this post on Instagram
అనుష్క శర్మ
అనుష్క శర్మ బాలీవుడ్ నటి మాత్రమే కాదు నిర్మాత కూడా. ఆమె 2008లో రబ్ నే బనా ది జోడితో తన నటన ప్రారంభించింది. వరుస హిట్ మూవీస్ లో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది అనుష్క శర్మ. ఈమె హైట్ 5 అడుగుల 9 అంగుళాలు
View this post on Instagram
సుష్మితా సేన్
సుష్మితా సేన్ హీరోయిన్ అండ్ మోడల్. 1994లో మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. 1996లో దస్తక్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. బీవీ నంబర్ 1, మై హూ నా, ఆంఖే సినిమాల్లో నటించింది. ఆర్య సహా వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. సుష్మితా సేన్ హైట్ దాదాపు 5 అడుగుల 9 అంగుళాలు. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉన్న నటీమణుల జాబితాలో నర్గీస్ ఫఖ్రీ, కృతి సనన్, నిమ్రత్ కౌర్ కూడా ఉన్నారు.
View this post on Instagram
దీపికా పదుకొనే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇండస్ట్రీలో అత్యంత పొడవైన నటీమణుల జాబితాలో ఉంది. ఈమె హైట్ కూడా దాదాపు 5 అడుగుల 9 అంగుళాలు. ప్రస్తుతం నటి తన కుమార్తె దువాతో మాతృత్వాన్ని ఆనందిస్తోంది..మరోవైపు అల్లు అర్జున్ - అట్లీ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. పలు ఈవెంట్స్ లో సందడి చేస్తోంది. ఐశ్వర్యారాయ్ హైట్ 5 అడుగుల 7 అంగుళాలు అయితే ప్రియాంక చోప్రా హైట్ 5 అడుగుల 6 అంగుళాలు.
View this post on Instagram<div





















