Rakesh Jhunjhunwala: 4 రోజుల్లో రూ.1331 కోట్లు లాభం.. ఆ రెండు టాటా కంపెనీలతో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా సంపద
రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా అంతకుముందు వారం జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ల పెరుగుదలతో జాక్‌పాట్ కొట్టేశారు. ఈ వారం టాటా గ్రూప్‌నకు చెందిన రెండు కంపెనీల షేర్లతో ఏకంగా రూ.1331 కోట్లు ఆర్జించారు.
భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం, ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా అంతకుముందు వారం జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ల పెరుగుదలతో జాక్‌పాట్ కొట్టేశారు. ఈ వారం టాటా గ్రూప్‌నకు చెందిన రెండు కంపెనీల షేర్లతో ఏకంగా రూ.1331 కోట్లు ఆర్జించారు.
Also Read: అద్భుతమైన సౌండ్‌బార్ కావాలా? బ్రాండెడ్ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం సరికొత్త గరిష్ఠాలకు ఎగబాకాయి. జీవితకాల రికార్డులు సృష్టించాయి. మదుపర్లలో సానుకూల సెంటిమెంటు ఉండటంతో సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఇదే ఊపులో టాటా గ్రూప్ షేర్ల ధరలు శిఖర స్థాయిని అందుకున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో టైటాన్ కంపెనీ లిమిటెడ్, టాటా మోటార్స్ షేర్ల ధరలు పుంజుకోవడంతో ఝున్‌ఝున్‌వాలా రూ.1331 కోట్లు ఆర్జించారు. ఈ వారంలో టైటాన్ 8.99, టాటా మోటార్స్ 30 శాతం వరకు పెరగడం గమనార్హం.
Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!
గురువారంతో ముగిసిన వారంలో స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ హవా కొనసాగించింది. ప్రతిరోజూ మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఏకంగా 30 శాతం రాణించింది. రూ.496 వద్ద ముగిసింది. ఈ కంపెనీలో రాకేశ్‌కు 3.77 కోట్ల షేర్లు ఉన్నాయి. గతవారం వాటి విలువ రూ.1445 కోట్లు. గురువారానికి రూ.429 కోట్లు లాభం రావడంతో ఆయన మొత్తం షేర్ల విలువ రూ.1874 కోట్లకు పెరిగింది.
Also Read: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి
టైటాన్ కంపెనీ షేర్లను ఝున్‌ఝున్‌వాలాకు కొన్నేళ్లుగా తన ఫోర్టుపోలియోలో ఉంచుకున్నారు. ఈ కంపెనీలో రాకేశ్ కుటుంబానికి 4.26 కోట్ల షేర్లు ఉన్నాయి. టైటాన్‌లో వారికి 4.81 శాతం వాటా ఉంది. గత వారం ఈ మొత్తం విలువ రూ.10,046 కోట్లు కాగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో 9 శాతం వరకు పెరిగింది. షేరు ధర రూ.2,567కే చేరుకోవడంతో ఝున్‌ఝున్ వాలాకు రూ.902 కోట్ల లాభం వచ్చింది. 2021 టైటాన్ కంపెనీ షేరు 65 శాతం పెరిగింది.
Also Read: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి
Also Read: Bitcoin: క్రిప్టోకరెన్సీని నమ్ముకున్నారా? అయితే మీ పని ఇక అంతే! మీకు అర్థమవుతుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి