By: ABP Desam | Updated at : 15 Jun 2022 06:20 PM (IST)
రూ.85 కోట్ల బడ్జెట్, రూ.2.58 కోట్ల కలెక్షన్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంటుంది. ఇటీవల ఈమె ప్రధాన పాత్రలో నటించిన 'ధాకడ్' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకి డైరెక్టర్ గా పని చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ఓ రేంజ్ లో బజ్ వచ్చింది.
కానీ రిలీజ్ తరువాత ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మొదటి రోజు నుంచే సినిమాకి నెగెటివ్ టాక్ మొదలైంది. రూ.85కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.2.58 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కంగనా కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకి వచ్చిన టాక్ తో డిజిటల్ రైట్స్ దక్కించుకోవడానికి కూడా ఏ సంస్థ ముందుకు రాలేదు.
దీంతో శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి చీప్ గా రూ.5 కోట్లకు అమ్మేశారు. అంటే మొత్తంగా ఈ సినిమాకి దాదాపు రూ.78 కోట్ల నష్టం వచ్చింది. ఈ లెక్కల ప్రకారం.. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ముందు వరుసలో నిలిచింది ఈ సినిమా. 'ధాకడ్'తో' పాటు విడుదలైన 'భూల్ భులైయా2' సినిమాకి హిట్ టాక్ రావడం కూడా కంగనా సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమా దెబ్బకి కంగనా సైలెంట్ అయిపోయింది. చేసేదేంలేక ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లింది.
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు
Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?
Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !
NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం