Mission Impossible 7: రన్నింగ్ ట్రైన్‌పై అదిరిపోయే యాక్షన్ సీన్లు, 61 ఏళ్ల వయస్సులోనూ టామ్ క్రూజ్‌లో అదే ఎనర్జీ - మేకింగ్ సీన్స్ చూసేయండి!
టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైన్ లో రూపొందించిన యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ సిరీస్ పేరు వింటేనే యాక్షన్ లవర్స్‌కు పూనకాలు వస్తాయి. ఈ సిరీస్‌లో ఏడో సినిమాగా వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1’. ప్రపంచ వ్యాప్తంగా జులై 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించాయి. కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో సినిమా మీద హైప్‌ను పెంచాయి. ‘‘మనం గతంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు జీవిస్తున్న జీవితం. గతం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేం.’’ అనే టామ్ క్రూజ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభం అయిన ఈ టైలర్, ఆద్యంతం ఆకట్టుకుంది.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ సీన్లు
మిషన్ ఇంపాజిబుల్ సినిమాల్లో సాధారణంగా మిషన్ కోసం ప్రాణాలిచ్చే పాత్రలో టామ్ క్రూజ్ కనిపిస్తాడు. కానీ, ఇందులో మాత్రం మిషన్ ఏమైనా సహచరుల ప్రాణాలే ముఖ్యం అన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ప్రతి సినిమాకీ యాక్షన్ విషయంలో లెవల్ పెంచుకుంటూ వెళ్తాడు టామ్ క్రూజ్. ఇందులో మరో అడుగు ముందుకేసి కొండ మీద నుంచి బైక్‌తో సహా దూకే సన్నివేశాలు కూడా షూట్ చేశారు. ఈ సీన్‌లో టామ్ క్రూజ్ ఎటువంటి డూప్ లేకుండా నటించారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను ఇప్పటికే విడుదల చేశారు. సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇదే కానుంది.
రన్నింగ్ ట్రైన్ లో ఒళ్లు జలదరించే సన్నీవేశాల చిత్రీకరణ
తాజాగా ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ చిత్రంలో రన్నింగ్ ట్రైన్ లో తెరకెక్కించి యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సన్నివేశాల కోసం చాలా కష్టపడినట్లు వెల్లడించారు. కదులుతున్న రైలు లోపలి భాగంతో పాటు పైన కూడా యాక్షన్ సీన్లు తీశారు. రైలు పై టామ్ క్రూజ్ చేసే ఫైటింగ్ సీన్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేకింగ్ వీడియోల దర్శకుడితో పాటు టామ్ క్రూజ్, ఇతర నటీనటులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సీన్లను షూట్ చేయడం కోసం ప్రత్యేకంగా ట్రైన్ బోగీలను తయారు చేయడంతో పాటు ప్రత్యేకంగా ట్రాక్ వేసినట్లు చూపించారు. హెలికాఫ్టర్ సాయంతో సీన్లను చిత్రీకరించారు. యాక్షన్ సన్నివేశాలను రికార్డు చేసేందుకు పదుల సంఖ్యలో కెమెరాలను వినియోగించారు. మొత్తంగా ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో టామ్ క్రూజ్ ఈసారి కూడా మెస్మరైజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
1996లో ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ ప్రారంభం
1996 సంవత్సరంలో ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ ఈ మూవీ సీరిస్ మొదలైంది. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ చిత్రానికి సంబంధించి ఆరు మూవీ సీరిస్‌లు విడుదలయ్యాయి. ఇప్పుడు విడుదల కాబోయే ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్’ ఏడవ సీరిస్. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ రచన, దర్శకత్వం వహించారు. సైమన్ పెగ్, రెబెక్కా ఫెర్గూసన్, వింగ్ రేమ్స్, వెనెస్సా కిర్బీ, హేలీ అట్‌వెల్, పోమ్ క్లెమెంటీఫ్, క్యారీ ఎల్వెస్, ఇందిరా వర్మ, షియా విఘమ్, రాబ్ డి మోరల్స్ తదితరులు నటించారు.
Read Also: ప్రభాస్ ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చే యాక్షన్ - 'సలార్' టీజర్ వచ్చేసిందోచ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial