అన్వేషించండి

Salaar Teaser : ప్రభాస్ ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చే యాక్షన్ - 'సలార్' టీజర్ వచ్చేసిందోచ్

Salaar Teaser Review In Telugu : ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'సలార్' టీజర్ విడుదల అయ్యింది. ఎలా ఉంది?

సలార్... సలార్... సలార్... మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎదురు చూస్తున్నది ఈ సినిమా కోసమే! కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... మాఫియాకు బాస్, బడా గ్యాంగ్‌స్టర్ పాత్రకు ప్రభాస్ కంటే పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు? అందుకని, అభిమానులు మాత్రమే కాదు... సగటు సినీ ప్రేక్షకులలో కూడా 'సలార్' (Salaar) సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 

'కె.జి.యఫ్', 'కె.జి.యఫ్ 2' చిత్రాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్  (Prashanth Neel) తీస్తున్న సినిమా కూడా 'సలార్'యే కావడంతో... ప్రభాస్ ను ఆయన ఎలా చూపిస్తారో? అనే ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ విడుదలైన స్టిల్స్ అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. ఇప్పుడు టీజర్ వచ్చేసింది. ఇది రెబల్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.    

'సలార్' టీజర్ వచ్చేసిందోచ్!  
'సలార్' టీజర్ స్టార్టింగ్ చూస్తే... హీరోకి ప్రశాంత్ నీల్ ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. ''లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్. అయితే... జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే... ఆ పార్క్ లో'' అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపించారు. రెండు పార్టులుగా సినిమా విడుదల కానుందని చెప్పేశారు. టీజర్ ఎండింగులో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా చూపించారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ టీజర్ అంతటా కనిపించింది. 
'సలార్' టీజర్ ఎలా ఉందో ఇక్కడ చూడండి:   

ప్రభాస్ జోడీగా శృతి హాసన్! 
'సలార్' సినిమాలో శృతి హాసన్ కథానాయిక. ఆద్య పాత్రలో ఆమె కనిపిస్తారు. ప్రభాస్, శృతి హాసన్ కలయికలో మొదటి చిత్రమిది. ఇందులో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు.

వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు కనిపించనున్నారు. 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. 

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న 'సలార్' 
Salaar Release Date : 'సలార్' విడుదలకు ఇంకెన్నో రోజులు లేదు. సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కె.జి.యఫ్', 'కె.జి.యఫ్ 2'తో పాటు రిషబ్ శెట్టి 'కాంతారా' చిత్రాన్ని నిర్మించినది ఆయనే.

Also Read : భార్యతో పూజలో పవన్ కల్యాణ్, ఒక్క ట్వీట్‌తో విడాకుల రూమర్స్‌కి చెక్!

తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14, 2022లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ కలయికలో యశ్ హీరోగా నటించిన 'కె.జి.యఫ్ 2'ను విడుదల చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ మధ్యలో విడుదల చేయాలని భావించినా... 'ఆదిపురుష్' విడుదల ఆలస్యం కావడం, కరోనా కారణంగా చిత్రీకరణ కొంత నెమ్మదిగా సాగడంతో సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు గతేడాది ఆగస్టులో వెల్లడించారు. అన్నట్టు... ప్రభాస్ 'రెబల్' సినిమా విడుదలైంది కూడా ఆ రోజే! 

Also Read : గుడిలో విజయ్ దేవరకొండ, సమంత - 'ఖుషి' కోసం యాగం, వైరల్ వీడియో

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagapathi Babu: ఇప్పుడు సుఖంగా ఉంది - మొహమాటం లేకుండా చెప్పిన జగపతి బాబు
ఇప్పుడు సుఖంగా ఉంది - మొహమాటం లేకుండా చెప్పిన జగపతి బాబు
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Enters Into Qualifier 2: స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
Embed widget