నందమూరి కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్ రోల్ చేస్తున్న సినిమా 'డెవిల్'. టీజర్ విడుదల చేశారు. హీరో లుక్స్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి? 'డెవిల్' పీరియాడిక్ స్పై ఏజెంట్ ఫిల్మ్. కళ్యాణ్ రామ్ లుక్స్ కూడా అందుకు తగ్గట్లు ఉన్నాయి. 'మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయట పడకూడదు' గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'డెవిల్' టీజర్ లో కళ్యాణ్ రామ్ లుక్స్ అన్నిటిలో ఇది హైలైట్ అని చెప్పాలి. ఓల్డ్ జేమ్స్ బాండ్ తరహాలో ఉంది. 'డెవిల్'లో మాస్ యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయని ఈ షాట్ చెప్పకనే చెప్పింది. 'డెవిల్'లో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. 'డెవిల్' టీజర్ లో హీరోయిన్ సంయుక్తా మీనన్ ను కూడా చూపించారు. కళ్యాణ్ రామ్ కు 'బింబిసార' తరహాలో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. 'డెవిల్'లో నందమూరి కళ్యాణ్ రామ్ (Image Courtesy : Abhishekpictures / YouTube)