Vijay Devarakonda - Samantha : గుడిలో విజయ్ దేవరకొండ, సమంత - 'ఖుషి' కోసం యాగం, వైరల్ వీడియో
విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఏపీలోని ఓ గుడిలో జరుగుతున్న యాగంలో పాల్గొంటున్నారు. ఎందుకు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...
ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత (Samantha) ఎక్కడ ఉన్నారో తెలుసా? ఏపీలోని ద్రాక్షారామంలో! ఏం చేస్తున్నారో తెలుసా? పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామం శివాలయంలో జరుగుతున్న యాగంలో పాల్గొన్నారు. ఎందుకో తెలుసా? 'ఖుషి' సినిమా కోసమే!
పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమా 'ఖుషి' (Kushi Movie). ఆయనకు జోడీగా సమంత రూత్ ప్రభు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఏపీలోని ద్రాక్షారామంలో జరుగుతోంది.
మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా!
'ఖుషి' చిత్రీకరణలో మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ యాగం చేస్తుంటే... వెనుక విజయ్ దేవరకొండ, సమంత నిలబడి ఉన్నారు. ఈ వీడియో విజయ్ దేవరకొండ స్వయంగా పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'ది దేవరకొండ బ్రాడ్ కాస్ట్' ఛానల్ క్రియేట్ చేసిన ఆయన... అందులో ఈ వీడియో షేర్ చేశారు. ఇది 'ఖుషి' లాస్ట్ షెడ్యూల్ అని ఆయన పేర్కొన్నారు.
Wrapping up their final Schedule #VijayDeverakonda #Samantha #kickrajwritings pic.twitter.com/MZw5xoQmQ6
— kickraj_official (@goparaj228) July 5, 2023
'ఖుషి'... సమంతకు పెళ్లైంది!
'ఖుషి'లోని కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ, సమంత భార్య భర్తలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సమంత 'ఖుషి' సెట్స్ నుంచి సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో ఆమె మెడలో నల్లపూసలు కనిపించాయి. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియోలో కూడా సేమ్ రెడ్ శారీలో సమంత కనిపించారు.
Also Read : మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్ - బీహెచ్ఈఎల్‌లో...
'ఖుషి' నుంచి ఓ పాట విడుదలైంది. హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. అవన్నీ చూస్తే... ప్రేక్షకులకు ఒక్క విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతి పాత్ర చేస్తున్నారని! అలాగే, ఐటీ ఉద్యోగిగా కూడా కనిపిస్తారని! కథలో భాగంగా ఆమె వివాహితగా కూడా కనిపిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. షూటింగ్ కోసమే ఆమె నల్లపూసలు ధరించారు. అదీ సంగతి! ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : నెల క్రితమే నిహారిక, చైతన్యకు విడాకులు - ఆలస్యంగా వెలుగులోకి!
ఆల్రెడీ విడుదల చేసిన 'నా రోజా నువ్వే...'కు తెలుగు సాహిత్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ అందించారు. ఆ పాటను సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ పాడారు. పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి'ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. పాటను కూడా ఈ ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.
మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial