Chiranjeevi: అదీ మెగాస్టార్ అంటే, కీలక ప్రకటన చేసిన చిరంజీవి - తరుణ్, శ్రీకాంత్‌పై ప్రశంసల వర్షం
రెండున్నర గంటల సినిమా వెనుక ఎంతో మంది కార్మికుల శ్రమ ఉంటుంది. అలాంటి వారికి తన పుట్టిన రోజున ఓ మంచి విషయాన్ని చెప్పారు చిరంజీవి.. వారి కోసం ఓ హాస్పిటల్ కట్టించబోతున్నట్లు ప్రకటించారు..
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సినిమా నిర్మాణంలో ఎంతో కష్టపడి పని చేస్తున్న కార్మికుల కోసం ఓ చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తంత్రి అయిన.. దిగవంగత కొణిదెల వెంకట్రావ్ పేరిట ఓ హాస్పిటల్ కటించనున్నట్లు ప్రకటించారు. ఈ ఆస్పత్రిని హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేస్తానని తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.
నిజానికి తాను పెద్దగా చదువుకోలేదని, అయినా నేడు మంచి జీవితాన్ని గడుపుతున్నామంటే.. కారణం సినిమా పరిశ్రమ అని అన్నారు. అలాంటి సినిమా పరిశ్రమ కోసం నిత్యం వేలాది మంది కార్మికులు అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే సినిమా పరిశ్రమ బాగుటుందని చెప్పారు. అందుకే వారికి కోసం చిత్రపురి కాలనీలో ఓహాస్పిటల్ కట్టించాలని చాలా కాలంగా అనుకుంటున్నట్లు వెల్లడించారు. 10 బెడ్స్ తో కూడిన ఆత్యాధునిక ఆస్పత్రిని నిర్మిస్తానని చెప్పారు.
‘‘ఈ పుట్టిన రోజున హాస్పిటల్ నిర్మాణం గురించి మాటిస్తున్నా. వచ్చే పుట్టిన రోజు లోపు హాస్పిటల్ పూర్తి చేస్తా’’ అని చిరంజీవి ప్రకటించారు. ఈ హాస్పిటల్ నిర్మాణంలో తనతో పాటు ఎవరు కలిసి వచ్చినా సంతోషంగా ఆహ్వానిస్తానని ప్రకటించారు. ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయినా.. మొత్తం భరించే శక్తి తనకు ఉందని చెప్పారు. తమ ఎదుగుదల కోసం సహకరిస్తున్న కార్మికుల కోసం హాస్పిటల్ కట్టించి ఇవ్వడం తన ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు.
సినిమా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో లైఫ్ ను చాలా ఎంజాయ్ చేయాలనే ఆలోచన ఉండేదని చిరంజీవి తెలిపారు. ఆ తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ లో బ్లడ్ బ్యాంక్ స్థాపించినట్లు తెలిపారు. అది ఇప్పటికీ చాలా మందికి సేవలు అందిస్తుందన్నారు. దీని వెనుక ఎంతోమంది సహకారం ఉందని వెల్లడించారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
తమ సినిమా విజయవంతం అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో.. దానికంటే ఎక్కువ సంతోషం, సంతృప్తి ఓ వ్యక్తికి సాయం చేసినప్పుడు ఉంటుందని చిరు వెల్లడించారు. అలా సాయం చేసిన రోజు ప్రశాంతంగా నిద్రపడుతుందన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ఈ హాస్పిటల్ నిర్మాణంలో సాయం చేసేందుకు తానో మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చిరు ప్రకటన పట్ల ఆయన అభిమానులు, సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ట్రోఫీ’ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రికెట్ ద్వారా ఉల్లాసాన్ని పొందమే కాకుండా.. అదే క్రీడ ద్వారా చాలా మందికి సాయం చేయడం గొప్ప విషయం అన్నారు చిరంజీవి. ఆటను సరదా కోసం మాత్రమే కాకుండా ఒక సేవా కార్యక్రమంగా మార్చిన తరుణ్, శ్రీకాంత్ ను అభినందిస్తున్నట్లు చెప్పారు. వారిపై చిరు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వేడుకలో శ్రీకాంత్, తరుణ్, తమన్‌తోపాటు సుధీర్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?