MAA Elections: ‘ఓటర్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాం.. సౌకర్యాలు కల్పించాలిగా..’
శనివారం సాయంత్రం ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించిన మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు.
ఆదివారం నాడు 'మా' ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించిన మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నాడు నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్ పార్టీకి 250 నుంచి 300 మంది వస్తారనుకున్నామని.. కానీ 560 మంది వచ్చారని చెప్పారు. అందరూ 'మా' సభ్యులే అని అన్నారు. వారంతా తనతోనే ఉన్నారని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ‘‘నా కుటుంబ సభ్యులను పిలిచి నాకెందుకు ఓటు వేయాలో చెప్పాను’’ అంటూ సినిమా రేంజ్ లో డైలాగ్స్ వేశారు మంచు విష్ణు.
వాళ్లకు నచ్చితేనే ఓటు వేస్తారని.. వాళ్లంతా పాజిటివ్ గా స్పందించారని చెప్పారు. 'మా' చరిత్రలో ఇప్పటివరకు జరగని రీతిలో ఇతర ప్రాంతాల్లో ఉన్న 'మా' సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేసి వెళ్తారని చెప్పారు. వాళ్లంతా చూపిస్తున్న ప్రేమ, భరోసా ఎన్ని జన్మలైనా రుణం తీర్చుకోలేనని చెప్పుకొచ్చారు. ఇక విష్ణు ప్యానెల్ కి మద్దతు ఇస్తున్న 'మా' మాజీ అధ్యక్షుడు నరేష్ కూడా విలేకరులతో మాట్లాడారు.
Also Read: ప్రకాష్ రాజ్ చుట్టూ వివాదాలే.. బ్యాన్ చేసిన మెగాఫ్యామిలీ ఈరోజు సపోర్ట్ చేస్తుందే..
రెండు రోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లు చూస్తున్నామని.. ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలవుతుందని.. మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుందని.. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. నాలుగైదు గంటల పాటు ఓట్లను లెక్కిస్తారని.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టాలని అనుకున్నట్లు.. కానీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Watch This : ‘నా ఓటు ఆ పానెల్ కే..’ నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
శుక్రవారం నాడు మోహన్ బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో డిన్నర్‌కు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారని.. దాదాపు 300పై చిలుకు రావడం మాటలు కాదని.. విష్ణు ప్యానెల్ కి ఏ స్థాయిలో మద్దతు ఉందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చని అన్నారు. మేం గెలవడం కాదు.. ఓటర్లు గెలవాలని డైలాగ్స్ వేశారు. క్యాంపు రాజకీయాలేవీ జరగడం లేదని.. భోజనాలకు ఇబ్బంది లేకుండా ఆఫీస్ ను ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్రాలలో ఉన్న నటీనటులు రావడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశామని.. అందులో తప్పేమీ లేదని అన్నారు. సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని కదా.. అని చెప్పారు. విష్ణు ప్యానెల్ ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేదని.. దాన్ని చూసిన తరువాత విష్ణు ప్యానెల్ పై నటీనటులకు మంచి అభిప్రాయం ఏర్పడిందని చెప్పారు. చివరిగా ప్రకాష్ రాజ్ ఇంగిత జ్ఞానం, విషయ జ్ఞానం ఉన్న వ్యక్తి అని అంటున్నారని.. కానీ క్యారెక్టర్ ఉండాలి కదా అని విమర్శించారు.
మంచు విష్ణు మాట్లాడిన వీడియో:
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి