MAA Elections: ప్రకాష్ రాజ్ చుట్టూ వివాదాలే.. బ్యాన్ చేసిన మెగాఫ్యామిలీ ఈరోజు సపోర్ట్ చేస్తుందే..
ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ పై నిషేధం పడటానికి సంబంధించిన కంప్లైంట్స్ చేసింది మెగాఫ్యామిలీ అనే చెప్పాలి. దానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమా.
ప్రముఖ కన్నడ నటుడు ప్రకాష్ రాజ్ అన్ని భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ గా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంటారు. నటన పరంగా ఆయన్ను ఢీ కొట్టేవారు లేరు. కానీ ఆయన పేరు ఎక్కువగా వివాదాల్లో వినిపిస్తుంటుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ పై నిషేధం పడటానికి సంబంధించిన కంప్లైంట్స్ చేసింది మెగాఫ్యామిలీ అనే చెప్పాలి. దానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమా.
పవన్ హీరోగా నటించిన 'గుడుంబా శంకర్' సినిమాతో వివాదం రేగింది. ఆ సినిమాలో నటించడానికి ముందుగా అంగీకరించిన ప్రకాష్ రాజ్ ఆ తరువాత డేట్లు సర్దుబాటు చేయలేకనో, లేదంటే సినిమాను లైట్ తీసుకున్నారో కానీ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో సినిమా నిర్మాణంపై ప్రభావం పడింది. దీంతో ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదులు చేశారు. ఏదో చిన్న హీరో విషయంలో ప్రకాష్ రాజ్ అలా ప్రవర్తించి ఉంటే పెద్ద సీన్ అయ్యేది కాదేమో కానీ పవన్ కళ్యాణ్ సినిమానే లైట్ తీసుకునేసరికి.. ప్రకాష్ రాజ్ ని కొన్నాళ్లపాటు నిషేధించారు. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
ఈ ఇష్యూ జరిగిన తరువాత మెగాఫ్యామిలీ హీరోల సినిమాలో ప్రకాష్ రాజ్ ను పక్కన పెట్టారు. 'గుడుంబా శంకర్' సినిమా సమయంలో చిరంజీవి 'శంకర్ దాదా ఎంబిబిఎస్' కూడా తెరకెక్కింది. నిజానికి 'శంకర్ దాదా' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకే రూపొందించింది. తమిళ వెర్షన్ లో ప్రకాష్ రాజ్ చేసిన పాత్ర తెలుగులో ఆయనకు దక్కలేదు. దానికోసం బాలీవుడ్ నుంచి పరేష్ రావల్ ను తీసుకొచ్చారు.
మధ్యలో చిరు నటించిన 'అందరివాడు'లో ప్రకాష్ రాజ్ నటించినా.. చివరకు ప్రకాష్ రాజ్ కు, చిరు, పవన్ లతో రాజీ కుదరదని ఓ తమిళ దర్శకుడు మురుగదాస్ రంగంలోకి దిగాడని అంటుంటారు. 'స్టాలిన్' సినిమాలో విలన్ పాత్రకు ప్రకాష్ రాజ్ నే తీసుకోవాలని భావించారు మురుగదాస్. అయితే పాత గొడవలతో ప్రకాష్ రాజ్ ని దూరం పెట్టింది మెగాఫ్యామిలీ. దీంతో మురుగదాస్ రంగంలోకి దిగి వ్యవహారాన్ని చక్కబెట్టారని అంటారు. ఆ తరువాత నుంచి చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ నటిస్తూ వచ్చారు. అలా మెగాఫ్యామిలీతో ఉన్న వివాదం సమసిపోయింది.
సినిమా ఇండస్ట్రీలో ఇలా ప్రకటించకుండా నిషేధించడాలు ఎన్నో ఉన్నాయి. కొందరు స్టార్స్ విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. కానీ ప్రకాష్ రాజ్ మ్యాటర్ మాత్రం ఇండస్ట్రీలో బాగా హైలైట్ అయింది. అలాంటి వివాదాల్లో వినిపించి పేరు.. ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవికోసం పోటీ పడుతోంది. ప్రకాష్ రాజ్ ను బ్యాన్ చేయాలనుకున్నవారు.. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ఆయన్ను గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి