అన్వేషించండి
Advertisement
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' స్పెషల్ ర్యాప్ సాంగ్ విన్నారా?
'సర్కారు వారి పాట' సినిమాకి సంబంధించిన ఓ ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఫ్యాన్స్ కి ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది కానీ సామాన్య ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోతుంది. కథ, కథనాల్లో కొత్తదనం లేదని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి కథను మహేష్ తన భుజాలపై నడిపించారని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. మహా రాసిన ఈ ర్యాప్ ను శ్రవణ భార్గవి, శ్రీ సౌమ్య వారణాసి, మనీష్, శృతి రంజని ప్రత్యూష పల్లపోతు, హారికా నారాయణ్ కలిసి పాడారు. తమన్ సంగీతం అందించారు. సినిమాలో ఈ ర్యాప్ లేదు కానీ ఫ్యాన్స్ కోసం ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది. రిలీజ్ చేసిన కాసేపటికే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ.75 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్ వదిలారు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
గాసిప్స్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion