By: ABP Desam | Updated at : 14 Dec 2021 02:57 PM (IST)
మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజులుగా మోకాలి సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన మోకాలికి సర్జరీ చేయించుకోవడనికి రెడీ అయిన సంగతి కూడా తెలిసిందే. సర్జరీ కోసమే ప్రస్తుతం హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా చిత్రీకరణకు ఫిబ్రవరి వరకూ విరామం ప్రకటించారు. దాంతో ఆయన అవసరం లేని సన్నివేశాలు దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మహేష్ మోకాలి సర్జరీ పూర్తి అయ్యింది. దీని కోసం ఆయన స్పెయిన్ వెళ్లారు. అక్కడ సర్జరీ పూర్తయిన తర్వాత దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం అరబ్ కంట్రీలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
సర్జరీ నిమిత్తం రెండు రోజుల్లో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ మూడు దేశాలు తిరిగారు. తొలుత... హైదరాబాద్ నుంచి స్పెయిన్ వయా దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తోంది. స్పెయిన్‌లో సర్జరీ పూర్తి అయిన తర్వాత మళ్లీ దుబాయ్ వచ్చారు. మహేష్ వెంట ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఉన్నారు.
ఇక, 'సర్కారు వారి పాట' సినిమాకు వస్తే... "ఈ సినిమా 'పోకిరి' తరహాలో ఉంటుంది" అని ఎన్టీఆర్‌తో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో మహేష్ బాబు చెప్పారు. ఆయనకు జోడీగా కీర్తీ సురేష్ నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న సినిమా విడుదల కానుంది.
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాపబుల్... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్
Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్
Harish Shankar: విడాకులపై స్వాతి జవాబుకు హరీష్ శంకర్ ఫిదా - శభాష్ అంటూ ప్రశంసలు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !
Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !
/body>