Mahesh Babu: డాన్స్ షోకి గెస్ట్‌గా మహేష్ బాబు - రెమ్యునరేషన్ ఎంతిచ్చారో తెలుసా?
తన కూతురితో కలిసి డాన్స్ షోకి గెస్ట్ గా రావడం కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు బుల్లితెరకి కాస్త దూరంగా ఉంటారు. బాగా ఫేమస్ అయిన టీవీ షోల్లో మాత్రం తళుక్కున మెరిశారు. ఇప్పుడు ఓ ఛానెల్ లో నిర్వహిస్తోన్న డాన్స్ షోకి మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే.. మహేష్ తో పాటు అతడి గారాల కూతురు సితార కూడా ఈ షోలో కనిపించబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ తన కూతురితో కలిసి సెట్స్ పైకి వెళ్లారు.
ఈ షోకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేష్ తన కూతురు చేయి పట్టుకొని స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్ స్టైలిష్ అవుట్ ఫిట్స్ ధరించారు. సితార కూడా గ్లిట్టర్ ఫ్రాక్ వేసుకొని స్టైలిష్ గా రెడీ అయింది. షోలో భాగంగా 'సర్కారు వారి పాట' సినిమాలో పెన్నీ సాంగ్ కి డాన్స్ కూడా వేసింది సితార. తన కూతురితో కలిసి డాన్స్ షోకి గెస్ట్ గా రావడం కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..? అక్షరాలా రూ.9 కోట్లు.
ఇంత మొత్తాన్ని ఆఫర్ చేయడంతోనే మహేష్ ఈ షోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. పలు యాడ్స్ లో కూడా నటించారు. ఇండియాలో ఉన్న హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో మహేష్ బాబు ఒకరు. ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది.
The Most adorable Dad & Daughter Duo of TFI 💕
— BA Raju's Team (@baraju_SuperHit) August 30, 2022
Superstar @UrstrulyMahesh & #SitaraGhattamaneni from the sets of Dance India Dance Show ❤️#MaheshBabu @ZeeTVTelugu #SSMBxSitaraForDIDTelugu pic.twitter.com/1aHbvh5sGh
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్.. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
మహేష్ తో యాక్షన్..
తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
Also Read : బాలీవుడ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది, ‘లైగర్’ నిర్మాత ఛార్మీ భావోద్వేగం
Also Read : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు