News
News
X

Kamal Rashid Khan Arrested : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కేను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తూ, అగ్ర తారలతో పాటు భారీ సినిమాలపై విమర్శలు చేస్తూ నెటిజన్లలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్. ఆయన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

FOLLOW US: 

బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ (Kamal Rashid Khan)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పూర్తి పేరు కంటే 'కేఆర్కే' (KRK Arrest) గా ప్రేక్షకులకు సుపరిచితుడు. హిందీలో కమల్ ఆర్ ఖాన్ కొన్ని సినిమాలు చేశారు. అయితే, ఇప్పుడు ఆయనకు ఉన్న గుర్తింపు వాటి వల్ల వచ్చింది కాదు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఆయన పలు కాంట్రవర్సీలకు కారణం అయ్యారు.

కమల్ ఆర్ ఖాన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?
హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, నటీనటులతో పాటు భారీ సినిమాలను విమర్శిస్తూ ట్వీట్స్ చేయడం కేఆర్కేకు అలవాటు. రెండేళ్ల క్రితం...  అనగా 2020లో ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అరెస్ట్‌కు కారణం అని తెల్సింది. మహారాష్ట్రలోని ముంబై ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఆయనను మలద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేఆర్కేను ఈ రోజు ఉదయం బోరివలీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

కేఆర్కే మీద కేసులు వేసిన సల్మాన్, మనోజ్ 
కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయి గతంలో కేసులు వేశారు. 

సల్మాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడటం లేదని, వసూళ్లు రావడం లేదని కేఆర్కే ట్వీట్స్ చేశారు. 'రాధే : మోస్ట్ వాంటెడ్ భాయ్' విడుదల అయినప్పుడు కేఆర్కే వరుస ట్వీట్స్ చేశారు. సినిమా బాలేదని రివ్యూ ఇవ్వడమే కాకుండా... కలెక్షన్స్ పోస్ట్ చేస్తూ ఫ్లాప్ అని విమర్శలు చేశారు. తన పరువుకు భంగం వాటిల్లే , ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ట్వీట్స్ ఉంటున్నాయని సల్మాన్ తరపు లాయర్ కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత సల్మాన్ గురించి ఎటువంటి ట్వీట్స్ చేయవద్దని కేఆర్కేను కోర్టు ఆదేశించింది. 

గత ఏడాది కేఆర్కే మీద మనోజ్ బాజ్‌పాయి క్రిమినల్ కేసు వేశారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ను 'సాఫ్ట్ పోర్న్' సిరీస్‌గా కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నారు. అంతే కాదు... మనోజ్ భార్య, కుమార్తె గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పరువు నష్టం ద్వావా వేశారు.

Also Read : 'బిగ్ బాస్' వల్ల తాగుడుకు బానిస కాలేదు - పుకార్లపై తేజస్వి

అప్పుడు 'ఆర్ఆర్ఆర్'... ఇప్పుడు 'లైగర్' 
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా... వార్తల్లో ఉండటమే ముఖ్యం అన్నట్లు కమల్ ఆర్ ఖాన్ ట్వీట్స్ చేస్తుంటారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదలైనప్పుడు... నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు కేఆర్కే ట్విట్టర్ అకౌంట్ చూస్తే... విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ల‌ 'లైగర్' సినిమా గురించి ఎక్కువ ట్వీట్స్ కనిపిస్తాయి. సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే... యూనిట్ సభ్యుల మనసు గాయపరిచేలా కేఆర్కే ట్వీట్స్ ఉంటాయి. గతంలో ఇదే విధంగా పలు సినిమాలపై ఆయన ట్వీట్స్ చేశారు.

Also Read : 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం మెగాస్టార్ - అమితాబ్ స్టాట్యూ కోసం రూ. 60 లక్షలు ఖర్చు పెట్టిన ఫ్యామిలీ!

Published at : 30 Aug 2022 09:24 AM (IST) Tags: Kamal Rashid Khan Kamal Rashid Khan Arrest KRK Arrest KRK Controversial Tweet

సంబంధిత కథనాలు

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం, సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం,  సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam