News
News
X

Tejaswi On Bigg Boss & Alcoholism : 'బిగ్ బాస్' వల్ల తాగుడుకు బానిస కాలేదు - పుకార్లపై తేజస్వి

'బిగ్ బాస్' (Bigg Boss) లో ఒకరి ప్రవర్తన కారణంజీఫా తేజస్వి మాదివాడ మందుకు బానిస అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం మీద ఆమె స్పందించారు.

FOLLOW US: 

'బిగ్ బాస్ 6' (Bigg Boss 6 Telugu) సెప్టెంబర్ 4న షురూ కానుంది. బుల్లితెరపై ఈ రియాలిటీ షో ఒక సంచలనం. ఈ కార్యక్రమానికి అభిమానులు ఉన్నారు. అలాగే, విమర్శకులు ఉన్నారు. ఎక్కువ రోజులు ఒక ఇంట్లో ఉండటం వల్ల మనుషులపై మానసికంగా ప్రభావం ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. నిజానిజాలు పక్కన పెడితే... 'బిగ్ బాస్ 6' ప్రారంభానికి ముందు, బిగ్ బాస్ హౌస్‌లో ఒకరి ప్రవర్తన కారణంగా తేజస్వి మాదివాడ మందుకు బానిస అయ్యారని ప్రచారం జరిగింది. సదరు ప్రచారం మీద ఆమె స్పందించారు. 

అప్పుడప్పుడూ తాగుతాను కానీ...
తాను అప్పుడప్పుడూ, అకేషనల్‌గా మద్యం తీసుకుంటానని తేజస్వి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, తాగుడుకు బానిస అయ్యానని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ''నాతో బిగ్ బాస్ హౌస్‌లో ఒకరు మిస్ బిహేవ్ చేశారని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. అందువల్ల, మందుకు బానిస అయ్యానని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. చాలా బావున్నాను. నా ఫ్రెండ్స్ ఫోన్స్ చేసి ఏమైందని అడుగుతున్నారు. నేను ఎలా ఉన్నానో తెలుసుకుంటున్నారు. అసలు, ఇటువంటి వార్తలు ఎక్కడ నుంచి పుట్టుకు వస్తాయో అర్థం కావడం లేదు'' అని తేజస్వి తెలిపారు. అదీ సంగతి! 

ప్రేమ అంటే నమ్మకమే కానీ... 
'క‌మిట్‌మెంట్‌' విడుదల సమయంలో పెళ్లి గురించి తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో పెళ్లి గురించి ఆలోచించానని, అయితే తనకు కాబోయే అత్తమామలు కండిషన్లు పెట్టడంతో ఆ పెళ్లి వద్దనుకున్నానని ఆమె తెలిపారు. మరి, ఇప్పుడు? పెళ్లి మీద నమ్మకం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తే... ''లేదు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. కానీ, పెళ్లి మీద లేదు. ప్రస్తుతం మహిళలు, మగవారి మనస్తత్వంపై వచ్చిన పుస్తకాలు చదువుతున్నాను. మన సమాజాన్ని అర్థం చేసుకుంటున్నాను'' అని తేజస్వి పేర్కొన్నారు.

జీవితంలో ఆ స్టేజికి వచ్చేశా!
జీవితంలో తాను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని... వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని... ఇప్పుడు తనను ఏదీ బాధ పెట్టలేదని తేజస్వి తెలిపారు. నాలుగైదు సంవత్సరాల క్రితం పుకార్లు తనను బాధించాయని, అప్పట్లో అయితే ఏడ్చేదానని అని ఆమె వివరించారు. ఇప్పుడు అయితే రూమర్స్ చూసి నవ్వుకుంటున్నాని తేజస్వి అన్నారు. వ్యక్తిగా తనలో అటువంటి మార్పు వచ్చిందన్నారు. 

Also Read : 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం మెగాస్టార్ - అమితాబ్ స్టాట్యూ కోసం రూ. 60 లక్షలు ఖర్చు పెట్టిన ఫ్యామిలీ!

పవన్ సాధినేని సినిమాలో...
ప్రస్తుతం పవన్ సాధినేని సినిమాలో నటిస్తున్నట్లు తేజస్వి మాదివాడ తెలిపారు.  అందులో చైతన్యకు జోడీగా నటిస్తున్నారట. అయితే, అది యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న 'మాన్‌స్ట‌ర్‌' చిత్రమా? కదా? అన్నది చెప్పలేదు. ఆమె లాస్ట్ సినిమా 'క‌మిట్‌మెంట్‌'పై విమర్శలు వచ్చాయి. అయితే, సినిమా ఇండస్ట్రీని తప్పుగా చూపించే సినిమా చేయలేదని విడుదలకు ముందు తేజస్వి వివరణ ఇచ్చారు. ప్రతి రంగంలో మహిళపై లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వంటివి ఉన్నాయని ఆమె తెలిపారు. 

Also Read : బిగ్‌ బాస్ 6 షో కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్

Published at : 30 Aug 2022 07:37 AM (IST) Tags: Bigg Boss Tejaswi Madivada Alcoholism Tejaswi On Rumours

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!