News
News
X

BIggboss6 Telugu: బిగ్‌బాస్6 షో కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్

బిగ్‌బాస్6 షోకు సర్వం సిద్ధం అయింది. మరికొన్ని రోజుల్లో మొదలవ్వబోతోంది.

FOLLOW US: 

తెలుగు ప్రేక్షకులు ఆదరించిన షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఆరో సీజన్‌కు సర్వం సిద్ధం అయింది. ఈ రియాల్టీ షో కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతో మంది. ఇప్పటి రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను ఎంపిక చేసి క్వారంటైన్లో ఉంచారు. ఈ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. మొదటి రెండు సీజన్లు తప్ప మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్ గా చేస్తూ ఉన్నారు. ఇందుకోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ముందు సీజన్ల కన్నా ఈ సీజన్‌కు ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఎంతంటే...
నాగార్జున బిగ్‌బాస్ షో కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతారు.ఆయన హోస్టింగ్ షో‌కు ప్లస్ పాయింట్ గానే మారుతోంది. అందుకే ఆయన అడిగినంత ఇచ్చేందుకు స్టార్ మా ఛానెల్ వారు కూడా రెడీ అవుతున్నారు. తెలిసిన సమాచారం మేరకు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఉండేందుకు నాగార్జున రూ.15 కోట్లు తీసుకుంటున్నారట. బిగ్ బాస్ 5 సీజన్‌కు ఆయన తీసుకున్న పారితోషికం రూ.12 కోట్లు. ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు పెంచేశారు. స్టార్ మాకు బిగ్ బాస్ షో వల్ల బాగానే లాభాలు ఆర్జిస్తుండడంతో అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. హిందీ బిగ్‌బాస్ షో కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.350 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. కాకపోతే అక్కడ వచ్చే రేటింగ్ కూడా అత్యధికం. 

ఓటీటీ ఫెయిల్
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ దాదాపు ఫెయిల్ టాక్ తెచ్చుకుంది. ఆశించినంత మేర రేటింగ్ రాకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో కాకుండా టీవీలో ప్రసారం చేసే రియాల్టీ షో ప్లాన్ చేశారు. ఓటీటీ సీజన్లో బిందు మాధవి విజేతగా నిలిచింది. బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. 

లీకైన లిస్టు
ఇప్పటికే కంటెస్టెంట్లు క్వారంటైన్లో ఉన్నారు. వారి జాబితా ఇదేనంటూ కొన్ని పేర్లు కూడా లీకయ్యాయి. అదెంత వరకు నిజమో తెలియదు కానీ ఆ లిస్టు వైరల్ అవుతోంది. ఓ రియల్ కపుల్ ఈ సీజన్లో పాల్గొనబోతున్నట్టు మాత్రం పక్కా సమాచారం. ఆ రియల్ కపుల్ సీరియల్ జంట అని ఒకరు, స్టార్ సింగర్స్ జంట అని మరొకరు చెప్పుకుంటున్నారు. అలాగే సిరి హన్మంత్ ప్రియుడు శ్రీహాన్ కూడా ఈ సీజన్లో రావడం పక్కా అని తెలుస్తోంది. ఇక ఓటీటీ బిగ్ బాస్‌లో అలరించిన యాంకర్ శివ కూడా తిరిగి రాబోతున్నాడట. చలాకీ చంటి, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, సీరియల్ నటుడు అమర్దీప్, రాజశేఖర్ అనే కామన్ మ్యాన్, జబర్ధస్త్ ఫైమా, యూట్యూబర్ ఆదిరెడ్డి, గలాటా గీతూ, నటి అభినయ శ్రీ వంటివారి పేర్లు వినపడుతున్నాయ్. వీరిలో ఎంత మంది షోలో కనిపిస్తారో చూడాలి. 

Also read: ఈ చిత్రంలో మీకు మొదట ఏ జీవి కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడు ఏ వైపు చురుగ్గా పనిచేస్తుందో చెప్పవచ్చు

Also read: షూ లేస్ చెవిరింగులు, ధరెంతో తెలిస్తే మీ షూ లేసులు కూడా ఇలాగే అమ్మేయాలనిపిస్తుంది

Published at : 29 Aug 2022 07:16 PM (IST) Tags: Bigg Boss 6 show Nagarjuna's remuneration Biggboss6 Telugu Biggboss Telugu Show

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ