Viral: షూ లేస్ చెవిరింగులు, ధరెంతో తెలిస్తే మీ షూ లేసులు కూడా ఇలాగే అమ్మేయాలనిపిస్తుంది
మీ షూ లేసులను వేల రూపాయలకు అమ్ముకోవాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఓ కంపెనీ వారికి మాత్రం వచ్చింది.
వెర్రి వేయి రకాలు అంటారు, అలాగే ఇప్పుడు ఫ్యాషన్ కూడా వెర్రిగా మారిపోయింది. కొత్తదనం పేరుతో రకరకాల ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి. అలాంటి చెవిరింగుల ఫ్యాషన్ ఇది. దీన్ని చూస్తే ఇది కూడా ఒక ఫ్యాషనేనా అనిపిస్తుంది, కానీ ఇప్పుడిది వైరల్ అయ్యింది. కొత్తదనం కోసం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లడమంటే ఇదే. వీటిని లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ Balenciaga తయారుచేసింది. వీటిని చూసి విమర్శకులు సైతం ఆశ్చర్యపోతారు. ఆ షూ లేసును చెవిరింగుగా మార్చాలని వచ్చిన ఆలోచనకు మాత్రం ఫిదా అంటున్నారు. ఇవి షూలేసుల్లా కనిపిస్తున్నా వీటిలో కాస్త ప్రత్యేకత ఉంది. పురాతన వెండి, ఇత్తడితో రీసైకిల్ చేసిన పాలిస్టర్, పత్తి దారాలతో వీటిని తయారుచేశారు. వెండి దారాలు, ఇత్తడి దారాలను ఇందుకు వాడారన్న మాట. వీటి ధర అక్షరాలా రూ. 261 డాలర్లు. అంటే మన రూపాయల్లో రూ.20,847. ఇంత పెట్టి వాటిని కొనుక్కునే బదులు ఇంట్లో ఉన్న షూలేసులను కట్టేసుకుంటే సరిపోతుందిగా అనుకునేవారు ఉన్నారు.
Also read: ఇలా చేస్తే గుండె పోటు, మెదడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 70 శాతం తగ్గించుకోవచ్చు, ఏం చేయాలంటే
ఫ్యాషన్ బ్రాండ్ తమ ఇన్‌స్టా పేజీలో ఈ చెవిపోగుల ఫోటోలను పోస్టు చేసింది. వాటిని చూడగానే నెటిజన్లు, ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు. ఉరివేసుకోవడానికి సరిపోయేంత పొడవుగా చెవిరింగులను ఇచ్చారు అంటూ ఒకరు కామెంట్ చేశారు. వీటిని కొనుక్కునేవాళ్లు కూడా ఉన్నారా? మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. ఇంకొందరు ఆ సంస్థకు పిచ్చి పట్టిందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు ఈ చెవిరింగులను తయారుచేసింది ఇటలీలోనంట. Balenciaga కేవలం అమ్ముతోంది.
Also read: మానసిక ఆందోళనతో బాధపడుతున్నారా? ఈ పనులు మానుకోండి, లేకుంటే లక్షణాలు ఇంకా పెరిగిపోతాయి
Balenciaga అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్యాషన్ యాక్సెసరీలు, దుస్తులను అమ్మే సంస్థ. హెడ్‌క్వార్టర్స్ ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ఈ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చాలా పాపులర్ సంస్థ. అందుకే దీన్నుంచి ఒక ఉత్పత్తి బయటికి వచ్చిందంటే ఒళ్లంతా కళ్లతో పరిశీలించేవారు, విమర్శించేవారు ఎంతోమంది.
View this post on Instagram