అన్వేషించండి

Allu Arjun : నిర్వాహకుల అత్యుత్సాహం, అల్లు అర్జున్​కు ట్రోలింగ్ తలనొప్పి!

‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఈవెంట్ లో నిర్వాహకుల అత్యుత్సాహం ఆయనకు ఇబ్బందిగా మారింది.

‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఓ రేంజిలో పెరిగిపోయింది. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా భారీగా ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. ఆయన నటన, స్టైల్ కు సినీ అభిమానులు బాగా అట్రాక్ట్ అయ్యారు. నిజం చెప్పాలంటే ‘అలవైకుంఠపురంలో’ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక ‘పుష్ప’ సినిమాతో మరింత ఎత్తుకు ఎదిగారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకుని సత్తా చాటారు. ‘పుష్ప’ సినిమాలోని అద్భుత నటనకు గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప 2’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.  ‘పుష్ప’ను మించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.

అల్లు అర్జున్ కు కొత్త తలనొప్పి

ఇక నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు హైదరాబాద్ కు వచ్చిన ఆయన కొలతలు కూడా తీసుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు చేసిన అత్యుత్సాహం ఆయనకు లేని తలనొప్పులు తీసుకొచ్చింది. తాజాగా హైదరాబాద్ లో ‘మంగళవారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహంగా కనిపించబోతున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరో అల్లు అర్జున్ అంటూ స్క్రీన్ మీద ప్రదర్శించారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇతర హీరోల అభిమానులు ఈ ప్రకటనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇప్పటికే టుస్సాడ్స్ మ్యూజియంలోమహేష్, ప్రభాస్ విగ్రహాలు

వాస్తవానికి ఇప్పటికే టుస్సాడ్ మ్యూజియం లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఆయా హీరోల సినిమాలకి సంబంధించిన రూపంలోనే వారి మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తొలిసారి మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని టుస్సాడ్ మ్యూజియంలో పెట్టారు. ఆ తర్వాత ‘బాహుబలి’ సినిమా అనంతరం ప్రభాస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఏర్పాటు కాబోతున్న మూడో తెలుగు హీరో అల్లు అర్జున్. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా అల్లు అర్జున్ గురించి తప్పుడు ప్రకటన ఇవ్వడం బన్నీకి లేని తలనొప్పులు తెచ్చింది. ప్రభాస్ అభిమానులు, మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  

Read Also: టీజర్ చూసి సుకుమార్ షాక్ అయ్యారు, 'మంగళవారం'పై అల్లు అర్జున్ ప్రశంసలు

Read Also: అందుకే రాహుల్‌ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget