Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Casting Couch Allegations : సినీ ఇండస్ట్రీకి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కొత్త కాదు. అయితే, తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సినీ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Social Media Influencer Casting Couch Allegations On Film Industry : టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కలకలం రేపాయి. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంటర్ నెట్ వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కమిట్మెంట్ ఇవ్వనిదే...
ఎవరైనా మన ఇన్ స్టా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ చూసి మీకు ఆఫర్స్ ఇస్తామంటే అస్సలు నమ్మొద్దని సదరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు. 'మన వీడియోస్ చూసి సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో ఆఫర్ ఇస్తామంటే నమ్మి రావొద్దు. ఇక్కడ కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడూ కూడా ఏ అమ్మాయికీ అవకాశం ఇవ్వరనేది పక్కా ప్రూవ్ అయ్యింది. నాకు మూడుసార్లు ఇలా జరిగింది. ఫస్ట్ సీరియల్‌కు ఆ తర్వాత సినిమాకు, ఇప్పుడు ఫేక్ సాంగ్‌కు కూడా ఇలానే జరిగింది.
నాతో ఫోక్ సాంగ్ చేస్తానని చెప్పి గంటల కొద్దీ కూర్చోబెట్టి ఓ మగాడి బుద్ధి ఏంటి అనేది చూపించేశాడు. కచ్చితంగా అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే 110 శాతం ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దయచేసి గుడ్డిగా నమ్మి ఎవరూ రావొద్దు. ఓ అమ్మాయి సినీ ఫీల్డ్‌లో సెటిల్ అయ్యిందంటే దాని వెనుక కమిట్మెంట్ ఉండే ఉంటుంది. ఇది నమ్మి చెబుతున్నా. ఏ అమ్మాయైనా టాలెంట్‌తో ఎదిగిందంటే నేను ఒప్పకోను. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా పర్వాలేదు. ఇక జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి వెళ్లను. నా ఊర్లో నా ఇంట్లో నా రీల్స్ నేను చేసుకుంటూ నా షాప్ నేను చూసుకోవాలని ఫిక్స్ అయిపోయా.' అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వరలక్ష్మి అనే ఇన్ స్టా పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు.
View this post on Instagram
Also Read : Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
గతంలోనూ సినీ ఇండస్ట్రీపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు మూవీస్ చేసిన హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో కొంతమందిపై ఆరోపణలు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సైతం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేశారు. దీనిపై కొందరు సినీ ప్రముఖులు కూడా వారికి సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆరోపణలపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
Also Read : Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























