Bigg Boss Rathika: అందుకే రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్
రాహుల్ సిప్లింగజ్, రతిక పర్సనల్ ఫోటోలు బయటకు రావడం పట్ల రతిక చెల్లెలు స్పందించింది. ఈ ఫోటోలు రాహుల్ వైపు నుంచే లీకైనట్లు అనుమానం వ్యక్తం చేసింది.
బిగ్ బాస్ బ్యూటీ రతిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రతిక బిగ్ బాస్ షోలో ఉండగానే ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల వ్యవహారంపై రాహుల్ ఘాటుగా స్పందించారు. తన క్రేజ్ ను రతిక ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందిన ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఫోటోల లీక్ వ్యవహారంపై రతిక చెల్లెలు స్పందించింది.
రాహుల్ వైపు నుంచే ఫోటోలు లీక్ అయ్యాయి- రతిక చెల్లెలు
రాహుల్ సిప్లిగంజ్ ఫేమ్ ఉపయోగించుకోవాల్సిన అవసరం రతికాకు లేదని ఆమె చెల్లెలు వెల్లడించింది. ఇద్దరు బ్రేకప్ కాకముందు కూడా ఆమె అతడి క్రేజ్ యూజ్ చేసుకోవాలి అనుకోలేదన్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రాహుల్ సిప్లీగంజ్ క్రేజ్ ను రతిక యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో మాకు అర్థం కాలేదు. రాహుల్ వైపు నుంచే లీక్ అయ్యాయని మేం అనుకున్నాం. ఆ ఫోటోలు ఉంటే రతిక దగ్గర, లేదంటే రాహుల్ దగ్గర ఉంటాయి. రతిక మోబైల్ తన దగ్గర లేదు. ఆమె షోలో ఉంది. అలాంటప్పుడు ఈ ఫోటోలు ఎలా బయటకు వస్తాయి? ఏ అమ్మాయి తన గురించి తాను నెగెటివ్ గా ప్రచారం చేసుకోదు. నిజానికి రాహుల్, రతిక పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. పెద్దలు ఈ విషయం గురించి మాట్లాడారు. రాహుల్ ను పెళ్లి చేసుకుంటానని నాన్నకు రతిక చెప్పింది. నువ్వు సంతోషంగా ఉంటానంటే ఓకే అని నాన్న చెప్పారు. మా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. చివరలో కొన్ని విషయాల్లో కండీషన్లు పెట్టారు. పెళ్లి తర్వాత ఈ పనులు చెయ్యకూడదు, ఆ పనులు చెయ్యకూడదన్నారు. వారి కండీషన్లు రతికకు నచ్చలేదు. ఆ తర్వాత ఇద్దరూ ఇది కుదరదని భావించి బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా కొనసాగిస్తున్నారు. రాహుల్ ఎందుకు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెట్టారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి అనేది కూడా తెలియదు. రాహుల్ ను కూడా మేము అడిగే ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలి అనుకోలేదు. ఆయన పెట్టిన పోస్టు వల్ల రతిక మీద నెగెటివ్ ప్రచారం మొదలయ్యింది. రాహుల్ ఫేమ్ వాడుకోవాలని ఏనాడు రతిక అనుకోలేదు. అలా అనుకుంటే అవకాశాల కోసం తన చేత రికమెండ్ చేయించుకునేది. కానీ, ఏ రోజు చేసుకోలేదు. వాళ్లు మంచిగా ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు బ్రేకప్ అయ్యాక చేసుకోవాల్సిన అవసరం లేదు” అని వెల్లడించింది.
రతికపై నెగెటివ్ ప్రచారం
అటు తన పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయంటూ రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రాహుల్. ఆరు సంవత్సరాల తర్వాత తన ఫోన్ లో పర్సనల్ గా దిగిన ఫోటోలు ఎలా బయటకొచ్చాయి అని ప్రశ్నించాడు. లోపలికి వెళ్ళేముందే ప్రీప్లాన్ చేసుకొని వెళ్ళారా? అంటూ విమర్శించాడు. రాహుల్ పెట్టిన ఈ పోస్టుతో రతికపై నెగెటివ్ ఇంపాక్ట్ పడింది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె వ్యవహార తీరుపై ట్రోల్ చేసిన నెటిజన్లకు రాహుల్ మరో అస్త్రం అందించినట్లు అయ్యింది.
Read Also: సమంత ‘ఎవెంజర్’ టీమ్ మెంబర్స్ వీళ్లే, ఈ టాలీవుడ్ హీరోలకే సామ్ ఓటు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial