Samantha Ruth Prabhu: సమంత ‘ఎవెంజర్’ టీమ్ మెంబర్స్ వీళ్లే, ఈ టాలీవుడ్ హీరోలకే సామ్ ఓటు
‘ది మార్వెల్స్’ ప్రమోషన్ లో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన ‘ఎవెంజర్’ టీమ్ మెంబర్స్ గా ఎవరెవరో ఉండాలో కొన్ని పేర్లు చెప్పింది. అందులో తెలుగు హీరోలు ఎవరు ఉన్నారంటే?
Samantha Favorite Actor: హాలీవుడ్ లో సూపర్ హీరోస్ మూవీస్ కు చాలా క్రేజ్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ చిత్రాలు బాగా ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత అలాంటి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ది మార్వెల్స్’ చిత్రం త్వరలో సినీ అభిమానులను అలరించబోతోంది. 2019లో వచ్చిన ‘కెప్టెన్ మార్వెల్’కు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతోంది. నియా డకోస్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంది. దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల కానుంది.
సినీ అభిమానులను అలరిస్తున్న ‘ది మార్వెల్స్’ ట్రైలర్
రీసెంట్ గా ‘ది మార్వెల్స్’ ట్రైలర్ విడుదల అయ్యింది. కెప్టెన్ మార్వెల్‍గా బ్రీ లార్సన్, మిస్ మార్వెల్‍గా ఇమాన్ వెల్లనీ, మొనికాగా తెయోనా పారిస్ ఇందులో అద్భుతన నటన కనబర్చారు.ఈ ట్రైలర్ సినీ అభిమానులకు బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెంచేస్తోంది. ఇక ‘కెప్టెన్ మార్వల్’ ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యం రాబోయే చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది.
‘ది మార్వెల్స్’ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత
తాజాగా హైదరాబాద్ లో జరిగిన ‘ది మార్వెల్స్’ ప్రమోషన్స్ లో నటి సమంత పాల్గొన్నది. అభిమానులతో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు నచ్చిన సూపర్ హీరోస్ మూవీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘మార్వెల్స్’, ‘ఎవెంజర్స్’ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. ‘మార్వెల్’ సినిమాలకు తాను పెద్ద అభిమానినని వెల్లడించింది. ‘ఉమెన్ పవర్’ను ఎంకరేజ్ చేసేందుకు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది.
నా ‘ఎవెంజర్’ టీమ్ లో ఉండేది వీళ్లే- సమంత
ఇక తాను ‘ఎవెంజర్’ అయి తనకు ఓ ప్రత్యేకమైన టీమ్ ఉంటే అందులో తన అభిమానులు ఉండాలని కోరుకుంటానని సమంత చెప్పుకొచ్చింది. ఇక ఇండియన్ హీరోలు తన టీమ్ లో ఉండాలనుకుంటే, తెలుగు నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఉండాలని కోరుకుంటానని వెల్లడించింది. ఇక బాలీవుడ్ నుంచి ఆలియా, హాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా కూడా తన టీమ్ లో ఉండాలని భావిస్తున్నట్లు చెప్పింది. ఇక ఈ చిత్రంలో కెప్టెన్ మార్వెల్ తో పాటు మిస్ మార్వెల్, కెప్టెన్ మొనిక కూడా ఉంటారని సమంత వెల్లడించింది. ఈ ముగ్గురు కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయన్నారు.
‘ది మార్వెల్స్’ చిత్రంతో దీపావళి చేసుకుంటా- సమంత
దీపావళికి పలు సినిమాలు విడుదల అవుతున్నాని చెప్పిన సమంతా, తాను ‘ది మార్వెల్స్’ చిత్రంతో దీపాల పండుగను జరపుకోనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా విడుదల సమయంలో తాను అమెరికాలో ఉంటానని చెప్పింది. అక్కడే ఈ సినిమాను చూడనున్నట్లు వివరించింది.
Read Also: నా మాటలు విని శ్రీదేవి కంటతడి పెట్టింది, ఆమెను అలా చూసి చాలా బాధేసింది- ఆదిల్ హుస్సేన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial