అన్వేషించండి

Adil Hussain: నా మాటలు విని శ్రీ‌దేవి కంటతడి పెట్టింది, ఆమెను అలా చూసి చాలా బాధేసింది- ఆదిల్ హుస్సేన్

తన మాటల కారణంగా అతిలోక సుందరి శ్రీదేవి కంట తడి పెట్టిందని చెప్పారు నటుడు ఆదిల్ హుస్సేన్. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాలో నటించే సమయంలో జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు.

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో అద్భుతంగా నటించారు. దశాబ్దాల తరబడి అగ్ర నటిగా కొనసాగారు.  దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1990వ దశకంలో ఆమె నటనకు విరామం ప్రకటించారు.  2012లో ‘ఇంగ్లీష్ వింగీష్’ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

శ్రీదేవి గురించి ఆదిల్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ చిత్రంలో తనతో పాటు కలిసి నటించిన ఆదిల్ హుస్సేన్ తాజాగా శ్రీదేవి గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా సమయంలో ఆమెతో ఏర్పడిన అనుబంధం గురించి చెప్పారు.‘ఇంగ్లీష్ వింగీష్’ సెట్ లో దివంగత నటి శ్రీదేవిని తొలిసారి కలిసినట్లు ఆదిల్ హుస్సేన్ తెలిపారు. ఆ సమయంలో తన మాటలు విని ఆమె కంటతడి పెట్టుకుందని చెప్పారు.  ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఆమె ఎందుకు కంటతడి పెట్టుకుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదిల్ మాటలు విని కంటతడి పెట్టిన శ్రీదేవి

శ్రీదేవితో కలిసి నటించే సమయంలో ఆమెతో కొన్ని విషయాలను చెప్పాను అన్నారు ఆదిల్. తన కెరీర్ లో మూడో సినిమానే ఆమెతో కలిసి నటించడం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. ‘ఇంగ్లీష్ వింగీష్’ షూటింగ్ సందర్భంగా శ్రీదేవితో క్లాసిక్ మూవీ 'స‌ద్మా' గురించి మాట్లాడినట్లు చెప్పారు. ఈ సినిమాలో శ్రీ‌దేవి నటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించానన్నారు. ఈ మూవీ చూసి తాను ఓ రోజంతా అన్నం తినలేదని చెప్పారు. “గౌరీ-బాల్కీ  శ్రీదేవికి నన్ను పరిచయం చేశారు.  ఆమె విశాలమైన కళ్లతో నా వైపు చూసింది. ఆమెతో మాటలు కలిపాను. మాటల సందర్భంలో శ్రీ‌దేవి న‌టించిన 'సద్మా' గురించి ప్రస్తావించాను. ఈ సినిమాను చూసి రోజంతా తాను ఏమీ తినలేకపోయానని చెప్పాను. నా మాటలు విని ఆమె కళ్ల నుంచి జలజలా నీళ్లు రాలాయి. ఆమె కంటతడి చూసి నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత మేము షూటింగ్ లోకి వెళ్లిపోయాం” అని ఆదిల్ వెల్లడించారు.

ఆమె కచ్చితంగా ఆస్కార్ తెచ్చేది- ఆదిల్

శ్రీదేవి నటన గురించి ఆదిల్ చాలా గొప్పగా చెప్పారు. ఆమె చాలా సున్నిత మనస్కురాలు అన్నారు. ఆమెను హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్‌ తో ఆమెను కంపేర్ చేశారు. ఒకవేళ తను  హాలీవుడ్ సినిమాలు చేస్తే, కచ్చితంగా ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చేదని అభిప్రాయపడ్డారు. శ్రీదేవి లెగసీని కొనసాగించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, ఆమె కూతురు జాన్వీ కపూర్ ఫుల్ ఫిల్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమె కష్టపడి పని చేస్తే తప్పకుండా తల్లి మాదిరిగా తయారు అవుతుందన్నారు. ఇప్పటికే జాన్వీ అద్భుతంగా నటిస్తోందని ఆయన ఆదిల్ అభిప్రాయపడ్డారు.        

Read Also: కమెడియన్​తో జతకట్టనున్న ‘చంద్రముఖి 2‘ బ్యూటీ, త్వరలో అధికారిక ప్రకటన!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget